
ఈ పాత్ర కోసం కంగనా, కృతి సనన్లలో ఎవరో ఒకర్ని తీసుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. చివరికి కంగనాకే ఎక్కువ మంది మొగ్గు చూపడంతో ఆమెను సంప్రదించినట్లు ప్రముఖ బాలీవుడ్ టాబ్లాయిడ్ ప్రచురించింది. ప్రస్తుతం ‘మణికర్ణిక’ చిత్రంలో నటిస్తోన్న కంగనా రనౌత్, షూటింగ్ పూర్తికాగానే అరుణిమ చిత్రానికి సంతకం చేయనున్నట్లు సమాచారం.
60 రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు ఎవరనే విషయం ఈ నెలాఖరులోగా వెల్లడించనున్నారు. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అరుణిమ సిన్హాను 2011లో నడుస్తున్న రైలు నుంచి తోసేశారు. దీంతో ఆమె ఒక కాలు కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ స్థైర్యం తెచ్చుకుని ఒంటికాలుతోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆదర్శంగా నిలిచింది.
ఏళ్ల తరబడి వైసీపీకి కంచుకోటగా ఉన్న పులివెందులలో ఈసారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ప్రశాంతంగా ఓటు వేసేందుకు వస్తున్న…
Ram Charan and Sukumar have come together for the second time after eight years. Their…