
అమరావతి విషయంలో స్థానిక రైతులకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిని చేసిందని, తాను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజధానికి మద్దతు పలికానని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్ కూడా పాదయాత్ర సందర్భంగా రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారని పేర్కొన్నారు. మాట ఇచ్చాక వెనక్కుపోబోమని చెప్పిన నేతలు.. ప్రస్తుతం అన్ని విషయాల్లోనూ వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు.
రాజధాని ప్రాంతంలో రైతులకు న్యాయం చేయాలని సీఎంకు లేఖ రాస్తే స్పందన లేదని విమర్శించారు. మరోవైపు మందడంలో ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ ని రైతులు అడ్డుకోబోయారు. దీంతో ఒక్కసారిగా జగన్‌కు వ్యతిరేకంగా రాజధాని నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అదుపు చేశారు. కారులోంచే రైతులకు అభివాదం చేసుకుంటూ జగన్ సచివాలయానికి వెళ్లిపోయారు. అయితే బీజేపీ కార్యకర్తల కుట్ర అని అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…