Telugu

వర్మా… కాపుల కోసం నువ్వెందుకు మొసలి కన్నీళ్ళు కార్చడం?

సినీ పరిశ్రమలో దర్శకులందరూ మంచో చెడో… తమ సినిమాలతోనే ప్రజల దృష్టిలో ఉంటారు. కానీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం నిత్యం ఏదో ఓ వివాదంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో లేనప్పటికీ వైసీపీ తరపున సినిమాలు తీస్తుంటారు కనుక ఆయనని వైసీపీ అనుబంద దర్శకుడని భావించవచ్చు. బహుశః అందుకే వైసీపీ నేతలతో పాటు ఆయన కూడా చంద్రబాబు నాయుడు-పవన్‌ కళ్యాణ్‌ భేటీపై వెంటనే తనదైన శైలిలో స్పందిస్తూ “కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. రిప్ కాపులు… కంగ్రాట్యులేషన్స్ కమ్మొళ్ళు” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

రాంగోపాల్ వర్మ ట్వీట్‌పై కాపు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌లో ఐక్యకాపునాదు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు మాట్లాడుతూ, “వైసీపీ నాయకుల ప్రోత్సాహంతోనే రాంగోపాల్ వర్మ ఇటువంటి ట్వీట్స్ చేస్తున్నారని భావిస్తున్నాము. వైసీపీలో కాపు మంత్రులందరూ మా జాతిని, ఆత్మగౌరవాన్ని సిఎం జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టి మళ్ళీ ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు. మా కాపుల గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎందుకు మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారో తెలీదు కానీ మాకు, ఈ రాష్ట్రానికి, ప్రజలకి ఎవరు మేలు చేస్తారో? ఎవరు అపకారం చేస్తారో తెలుసు. ఆ మాత్రం విచక్షణా జ్ఞానం మాకు లేదని రాంగోపాల్ వర్మ, వైసీపీ నాయకులు భావిస్తున్నట్లున్నారు. అది వారి దురహంకారానికి నిదర్శనంగా భావిస్తున్నాము,” అని అన్నారు.

ఈ ప్రెస్‌మీట్‌లో కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రహ్మణ్యం, ఐకాస అధ్యక్షుడు మాసబత్తుల శ్రీనివాస్, దూడల శ్రీనివాస్, ఆలా తారకరామారావు, నూకల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Why Ranabaali Raises Big Doubts on Prabhas’ Fauzi?

Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…

7 minutes ago

Sai Pallavi’s Warrior Avatar: Why Ramayana Fans Angry?

The promotional materials for Nitesh Tiwari’s Ramayana are back in the headlines again. While the…

37 minutes ago