
లైవ్‌లో ఆయనతో మాట్లాడుతున్న న్యూస్ యాంకర్ సంజన చౌహాన్‌ను ఆయన మూడు సార్లు ‘బేబీ బేబీ’ అంటూ సంబోధించారు. దీంతో ఒక్కసారిగా ఇబ్బందికి గురైన సంజనా, సూరజ్ మీద విరుచుకుపడింది. ఒక మహిళతో ఎలా మాట్లాడాలో తెలియని కర్ణి సేనలు ఓ కల్పిత పాత్ర గౌరవం కోసం దేశ ప్రజలను ఇబ్బంది పెడుతుండటం హాస్యాస్పదంగా ఉందంటూ, గౌరవం కాపాడటంలో ఇదెక్కడి సూత్రమని ఆమె ప్రశ్నించింది. దీనికి సమాధానం చెప్పడానికి తడబడిన సూరజ్, ఆమెను ‘నోర్మూయ్’ అంటూ లైవ్ నుంచి వెళ్లిపోయాడు.
తనను అగౌరవంగా సంబోధించినందుకు సూరజ్ క్షమాపణలు తెలియజేయాలని సంజన డిమాండ్ చేసింది. ఈ విషయమై జాతీయ మహిళా కమిషన్‌కి ఆమె ఫిర్యాదు కూడా చేసింది. మహిళా కమిషన్ వారు సూరజ్‌ని పిలిపించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. లైవ్ డిబేట్‌కి సంబంధించిన వీడియో చూసినవారంతా సంజనకు మద్దతుగా, సూరజ్‌కి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు.
Rakul Preet Singh is keen to make a comeback to Telugu cinema soon. During a…
BOTTOM LINE Stale Malayalam-Coded Thriller Bites the Dust PLATFORM ZEE 5 RUNTIME 2 Hrs 42…