Telugu

దేవుడు ఎక్కువే ఇచ్చాడు… తప్పు లేదు..!

‘అవసరంలో ఉన్న ఎవరికైనా సాయం చెయ్యడంలో గొప్పతనమేముంది? దేవుడు మనకి వారి కంటే ఎక్కువే ఇచ్చాడు కదా?’ అన్నాడు సినీ నటుడు కార్తీ. దీవించాల్సిన దాని కంటే దేవుడు మనల్ని అధికంగానే దీవించినప్పుడు… ఇబ్బందుల్లో ఉన్న ఒక వ్యక్తిని ఆదుకునేందుకు ఉన్న సమస్య ఏంటని అడిగాడు. మొదట్లో తానిలా ఉండేవాడిని కాదని, తన తండ్రిని చూసి అలా తయారయ్యానని చెప్పాడు. తన తండ్రి దగ్గరకు ఎవరైనా పేదవారు డబ్బులు కావాలని వస్తే.. వంద కావాలంటే రెండు వందలు ఇచ్చేవారని, నాలుగు వందలు అడిగితే ఐదు వందలు ఇచ్చేవారని చెప్పాడు.

ADVERTISEMENT

‘ఎందుకు నాన్నా! అలా ఎక్కువ ఇస్తారు?’ అని అడిగితే.. ‘దేవుడు మనకి అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఆ వంద అదనంగా ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి మరికొంచెం ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండాలనే కదా మనం ఆ డబ్బులిచ్చాం.. మంచి వాడైతే ఆ డబ్బు మంచిపనికి వాడుతాడు. మామూలు మనిషైతే ఆ డబ్బులు ఇంటికి తీసుకెళ్తాడు.. చెడ్డవాడైతే ఆ డబ్బుతో తాగుతాడు. ఏం చేసినా ఆనందిస్తాడు. మనకి కావాల్సింది అదే కదా’ అని చెప్పారని… ఆయన చెప్పినట్టే తనకు చేతనైనంత సాయం సమాజానికి చేస్తుంటానని అన్నాడు. తన భార్య తన కంటే మంచిదని, తనకంటే మంచి చేయాలని చూస్తుందని, తనకు అభ్యంతరం చెప్పదని కార్తీ తెలిపాడు.

ఇక తన అన్నయ్య సూర్య గురించి చెప్తూ… ప్రతి ఇంట్లో అన్నదమ్ములు పెరిగినట్టే తన అన్నయ్యతో తాను కలిసి పెరిగానని సినీ నటుడు కార్తీ తెలిపాడు. చిన్నప్పుడు బాగా గొడవలు పడేవారమని చెప్పాడు. అమ్మానాన్నలు చెప్పిన దానికి అన్నయ్య వ్యతిరేకంగా చేస్తే… నేను మాత్రం వాళ్లెలా చెప్పేవారో అలాగే చేసేవాడినని అన్నాడు. స్కూల్ విద్య పూర్తయిన తరువాత తామిద్దరం మంచి స్నేహితులమయ్యామని, ఉన్నత విద్యకోసం యూఎస్ వెళ్లిన తరువాత అన్నయ్య విలువ తెలిసిందని అన్నాడు.

తన కెరీర్ మొదట్లో అన్నయ్య ఏ సినిమా చేయమంటే అవే చేసేవాడినని కార్తీ చెప్పాడు. ఇప్పటికీ అన్నయ్య చెబితే మాట్లాడకుండా చేస్తానని అన్నాడు. అప్పట్లో అంటే గొడవపడేవాడినని, ఇప్పుడు అన్నయ్య అంటే చాలా గౌరవమని తెలిపాడు. తన తండ్రి తరువాత ఆయనలా అన్నయ్య కనిపిస్తాడని, వదినను చూసి తన భార్య నేర్చుకుంటుందని చెప్పాడు. తన తండ్రి చాలా కష్టపడి తమను పెంచారని, పగలంతా సినిమా షూటింగ్స్ లో పాల్గొని, రాత్రుళ్లు నాటకాలు ఆడేవారని తెలిపాడు. కేవలం నాలుగు గంటలే నిద్రపోయేవారని, అంత కష్టపడి చలనచిత్ర రంగంలో నిలదొక్కుకున్నాడని తెలిపాడు.

తొలి సినిమా చేసినప్పుడు కథ ఏంటో కూడా తనకు తెలియదని, యూఎస్ లో విద్యాభ్యాసం పూర్తైన తరువాత సినిమాల్లో నటించాలని అన్నయ్య సూచించాడని, సినిమాల్లో ఫెయిల్ అయితే మరో కెరీర్ ఉండాలని ఉన్నత విద్యాభ్యాసం చేయించారని తెలిపాడు. ‘దర్శకుడు మంచోడు, స్క్రిప్ట్ బాగుంది, నటించు’ అని అన్నయ్య చెప్పాడని కార్తీ తెలిపాడు. నటన రాదు కదా ఎలా? అని అడిగితే…

‘నేర్చుకోడానికి ట్రై చెయ్…నేర్చుకోవడం మొదలు పెడితే నటన వస్తుంది. డైరెక్టర్ ఏం చెబితే అది అలాగే చెయ్’ అని అన్నయ్య సూచించాడని కార్తీ తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ రెండేళ్లు నడిచిందని అన్నాడు. అన్నయ్య చెప్పినట్టే ఆ సినిమా సూపర్ హిట్ అయిందని అన్నాడు. ఏడాదిపాటు ఆడిందని, అవార్డులు కూడా వచ్చాయని గుర్తుచేసుకున్నాడు. ఆ తరువాతి సినిమా షూటింగ్ మూడేళ్ల పాటు జరిగిందని, ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయిందని తెలిపాడు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?

A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…

4 hours ago

The Paradise Has Hype, But Is It Enough?

Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…

4 hours ago