
సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ మూవీ ట్రైలర్ ని చెన్నై లో జరిగిన ఆడియో ఫంక్షన్ లో రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్ లో మాస్ ఆక్షన్ ఎలిమెంట్స్ తో యాక్క్షన్ డ్రామాగా ఆకట్టుకుంది. సూర్య గ్యాంగ్‌స్టర్‌గా, పూజా హెగ్డే ప్రేమికురాలిగా కనిపిస్తూ, హింసాత్మక గతాన్ని వదిలి ప్రేమ కోసం సంఘర్షించే కథాంశంగా ట్రైలర్ ని చుస్తే అర్థం అవుతుంది.
సూర్య రెట్రో స్టైల్ లుక్ బావుంది, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటుంది. గడ్డం, రఫ్ లుక్‌లో సూర్య గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఒదిగిపోయాడు. సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు జోష్‌ను తెప్పించింది. ప్రత్యేకించి “కనిమా” పాట ఇప్పటికే సక్సెస్ అయింది. అల్ఫోన్స్ పుత్రెన్ ఎడిటింగ్ ట్రైలర్‌ను వేగవంతంగా, స్టైలిష్‌గా మలిచారు. జోజు జార్జ్, జయరాం, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
రెట్రో ట్రైలర్ సూర్య యొక్క స్టార్ పవర్‌ను పూర్తిగా ఉపయోగించుకుంటున్నప్పటికీ, కథ మాత్రం సాంప్రదాయ గ్యాంగ్‌స్టర్-రొమాన్స్ ఫార్మాట్‌ను అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అంటే ఫ్యాన్ మూమెంట్స్‌తో సినిమాలు తీస్తాడు కానీ, ఓవరాల్‌గా ఓ డీలా ఫీల్ ఇచ్చే డైరెక్టర్ అని పేరు ఉంది. కొన్ని సీన్లు బాగుంటాయ్ కానీ కథ మొత్తంగా అంతగా ఆకట్టుకోదు అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. పిజ్జా, జిగర్తాండ లాంటి కార్తీక్ సుబ్బరాజ్ గత చిత్రాలు కథనంలో ఊహించని ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటాయి, కానీ రెట్రో ట్రైలర్ ఆ స్థాయి కొత్తదనాన్ని సూచించడంలో విఫలమైంది. పూజా హెగ్డే పాత్ర ప్రేమ కథాంశానికి పరిమితమైనట్లు కనిపిస్తోంది.
సూర్య బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని అందుకొని చాలా సంవత్సరాలు అయింది. గత ఏడాది వచ్చిన కంగువ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది, అందుకే ఇపుడు సూర్యకు రెట్రో చాలా కీలకమైన చిత్రం. ఈ చిత్రంతో మళ్ళీ తన స్టార్‌డమ్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ తన సిగ్నేచర్ నరేషన్ స్టైల్‌తో సినిమాను ఎలివేట్ చేయకపోతే, రెట్రో ఒక సాధారణ మాస్ ఎంటర్‌టైనర్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది
Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…
Katrina Kaif is in a new phase of life after becoming a mother, but her…