
టీజర్ ని బట్టి సినిమా ని అంచనా వెయ్యాల్సి వస్తే చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేనట్టే. అయితే ట్రైలర్ వచ్చాక మనం సినిమా పై ఒక నిర్ధారణకు రావొచ్చు. కార్తికేయ నటన రొమాంటిక్ సన్నివేశాలలోనూ, మాస్ ఎపిసోడ్స్ లోనూ ఆకట్టుకునేలా ఉంది. ఆర్ఎక్స్ 100 లాగా విషయం ఉన్న కథలు ఎంచుకుంటే ఖచ్చితంగా మంచి రేంజ్ హీరో అవుతాడు. కొత్త అమ్మాయి అనగ టీజర్ లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుంది. టీజర్ మొదట్లో వచ్చే సాయి కుమార్ వాయిస్ ఓవర్ ఆకట్టుకునేలా ఉంది.
మరోవైపు సినిమా గురించి సినిమా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గురించి చాలా హైప్ ఇస్తున్నాడు మన హీరో గారు. అయితే గుణ 369 రొటీన్ గా ఉన్నా కార్తికేయ గత సినిమా హిప్పీలా అతిగా అయితే లేదు. ఈ చిత్రాన్ని తిరుమల రెడ్డి, అనీల్ కడియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింతన్ భరద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడితే కార్తికేయ వన్ ఫిలిం వండర్ గా మిగిలిపోయే అవకాశం ఉంది.
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…
Mohanlal is preparing for the release of his upcoming film Drishyam 3 directed by Jeethu…