
మరి తొలి రోజు పవన్ స్టామినా ఎంత? అన్నది కీలకంగా మారింది. ఈ సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా ద్వారా తొలిరోజు కొత్త రికార్డులను సృష్టించడంతో, మరి పవన్ ‘కాటమరాయుడు’ ఆ రేంజ్ ను అందుకుంటుందా? లేదా? అన్నది ట్రేడ్ వర్గాలలో సైతం ఓ ప్రశ్నగా మారింది. దీనికి కారణం… ఓ సాధారణ రీమేక్ సినిమాగా విడుదల కానుండడం ఒకటైతే, ప్రస్తుతం విద్యార్ధులు పరీక్ష సమయాలలో మునిగిపోవడం మరో ప్రధాన కారణం. దీంతో ‘నాన్ బాహుబలి’ రికార్డులు పవన్ సొంతమవుతాయో లేదో చూడాలి.
అలాగే ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే, ఇప్పటివరకు పవన్ 2 మిలియన్ మార్క్ ను అందుకున్నది లేదు. మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పాటు నితిన్ వంటి హీరోల కెరీర్ లో కూడా 2 మిలియన్ మార్క్ ఉండడంతో, ‘కాటమరాయుడు’తో దీనిని అందుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా దాదాపుగా 1 మిలియన్ వసూలు చేస్తే, 2 మిలియన్ మార్క్ పెద్దగా కష్టసాధ్యం కాకపోవచ్చు. దీంతో ప్రీమియర్స్ తో ‘కాటమరాయుడు’ ఎంత సాధిస్తాడో అన్నది కూడా కీలకంగా మారింది.
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…