Telugu

ప్రతి రోజు ‘కిక్’ ఇస్తానంటున్న పవన్ కళ్యాణ్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా మూవీ ‘కాటమరాయుడు’కు సంబంధించిన ‘హ్యాపీ న్యూ ఇయర్ 2017’ స్టిల్స్ అభిమానుల్లో సందడి చేస్తున్నాయి. రోజుకొక పోస్టర్ చొప్పున ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు కొత్త పోస్టర్స్ విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికీ రెండు పోస్టర్స్ విడుదల కాగా, ఆ రెండింటిలోనూ పవన్ ఫేస్ కనపడకుండా కేవలం అడుగులు మాత్రమే చూపించారు.

అయితే చివరగా విడుదల చేయబోయే పోస్టర్ లో మాత్రం పవన్ ఫేస్ ను రివీల్ చేయబోతున్నారు. అది డిసెంబర్ 31వ తేదీన విడుదల కానుంది. అదే రోజు రాత్రి సమయంలో ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ చెప్తూ ఫస్ట్ టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా నూతన సంవత్సరం వరకు ప్రతి రోజు సరికొత్త పోస్టర్స్ తో అభిమానులకు ‘కిక్’ ఇవ్వనున్నాడు పవర్ స్టార్.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Suriya 50 Has Two Big Names. Who Will Get It?

Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…

17 minutes ago

కొండా సురేఖ: కూటమి నేతలకు ఓ కేస్ స్టడీ వంటిదే!

ఆంధ్రప్రదేశ్‌ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…

17 minutes ago