Telugu

కౌశిక్ రెడ్డి పై ‘గుడ్ల’ దాడి..!

ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ పార్టీలో పార్టీ అధినేత కేసీఆర్ పేరు కంటే ఎక్కువగా ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. ఎప్పుడు ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తద్వారా అధికార పార్టీ శ్రేణుల నుండి విమర్శలను ఎదుర్కోవడం పాడికి అలవాటుగా మారింది.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు కాంగ్రెస్ VS కౌశిక్ ల వివాదం శృతి మించిందనే చెప్పాలి. అసలు విషయానికి వస్తే, హనుమకొండ లోని కమలాపూర్ గ్రామసభలో అధికార విపక్ష పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పంపణీ విషయంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది.

ఇందిరమ్మ ఇళ్ల జాబితా మీద సమగ్ర సమాచారం ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డి అధికారులను ప్రశ్నించిన తీరు పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్టు ఇందిరమ్మ ఇళ్ల పంపిణి విషయంలో నిబద్దత, నిజాయితీ లేవని, ఇదంతా కూడా పచ్చి మోసం, కేవలం సర్పంచ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బూటకపు రాజకీయాలు చేస్తుందంటూ కౌశిక్ మరోమారు తన నోటికి పని చెప్పారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఈఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆన్ లైన్ చెయ్యలేకపోతుందంటూ వాపోతూ స్థానిక అధికార పార్టీ నేతలను ఉద్దేశించి బ్రోకర్ గాళ్ళు అంటూ సంబోధించి కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహానికి గురయ్యారు కౌశిక్. దీనితో అక్కడ ఉన్న అధికార పార్టీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి పై టమోటాలు, కోడి గుడ్లు వేయడంతో బిఆర్ఎస్ శ్రేణులు కూడా రెచ్చిపోయి కాంగ్రెస్ నేతల పై కుర్చీలు విసిరారు.

దీనితో ఆ కార్యక్రమమంతా కూడా రసాభాసగా మారింది. అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నించడం ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ కర్తవ్యమే అయినప్పటికీ కౌశిక్ ఈ రకంగా బ్రోకర్ గాళ్ళు అంటూ అధికార ఆపార్టీ శ్రేణులను దూషించడం సమంజసం కాదు. రెండు పార్టీల నేతలు కూడా తమ రాజకీయ భాష మీద కాస్త శ్రద్ద పెట్టి రాజకీయాలు చేస్తే వాటిని ప్రజలు హర్షిస్తారు. లేకుంటే ఏపీలో మాదిరి బూతుల నేతలకు స్వస్తి పలకడం కాయం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Is AA23 in Trouble? Allu Arjun’s Camp Responds

Reports about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 hitting a roadblock have created fresh confusion…

4 hours ago

Reporting Live Review: An Absolute Disaster, Nothing Works

BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…

5 hours ago