
ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి కాబట్టి సరిపోయింది లేకపోతే దీని వల్ల భారీ నష్టం జరిగేది అని పార్టీ ఆరోపించింది. సత్తుపల్లి, ధర్మపురి నియోజకవర్గల్లో ఓట్లు తక్కువ రావడానికి ట్రక్కు గుర్తే కారణమని కేసీఆర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇకపై ట్రక్కు గుర్తును ఎవ్వరికీ కేటాయించమని ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సమితికు పెద్ద ఊరట కలిగించే అంశం. ఈసీ నిర్ణయంపై తెరాస నేతలు హర్షం వ్యక్తం చేశారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో 16కు 16 సీట్లు సాధించి (మరో సీటు మిత్రపక్షం ఎంఐఎం) కేంద్రంలో చక్రం తిప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. ఈ నిర్ణయం ఆ దిశగా ఎంతో ఉపయోగపడుతుంది. తొందరలో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. మంత్రివర్గంలో కేటీఆర్, హరీష్ రావులకు చోటు ఇవ్వకపోవడంతో ఎన్నికల ప్రచారంలో వారిని కూడా విరివిగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. వారు కూడా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చెయ్యబోతున్నారు.
Sanjay Leela Bhansali recently confirmed the release date of Love & War, bringing relief to…
A student on an F-1 visa secured an internship with Amazon, but the opportunity soon…