
ఈ మధ్య కాలంలో ప్రతి పార్టీ అధినేత బయటకు వస్తే చాలు వారిని ఉత్తేజ పరచడానికి ఆ పార్టీ కార్యకర్తలుగా చెప్పుకునే కొంతమంది ఔత్సాహికులు సీఎం…సీఎం అంటూ అర్ధం పర్ధం లేని నినాదాలు చేస్తూ చివరికి వారి అధినేత నుంచే చివాట్లు కొని తెచ్చుకుంటున్నారు.
అయితే ఈ ట్రెండ్ కి ఆజ్యం పోసింది మాత్రం పవన్ అభిమానులనే చెప్పాలి. పవన్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ, సభ ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా సరే వారి అభిమనాన్ని వ్యక్త పరచడానికి, తమ అధినేత దృష్టిని ఆకర్షించడానికి సీఎం..సీఎం అంటూ నినాదాలు చేసేవారు.
అయితే ఈ నినాదాలను మొదట్లో అంతగా పట్టించుకుని పవన్ వారి అభిమానులను నిలువరించలేదు. అయితే 2019 ఎన్నికలలో పవన్ ఘోర ఓటమి తరువాత కూడా జనసైనికులు అసలు సభలో పవన్ ఏం చెప్తున్నారో కూడా పట్టించుకోకుండా ఇదే తరహాలో సీఎం..సీఎం అంటూ నినదించడంతో పవన్ లో అసహనం బయటకొచ్చింది.
దీనితో సీఎం..సీఎం అంటూ ఇక్కడ అరవడం కాదు రా బాబు, ఓట్లు వేయండి, పార్టీని గెలిపించండి అంటూ వారి పార్టీ క్యాడర్ పై పలుమార్లు అసహనాన్ని వ్యక్తపరిచారు. ఇక ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం అత్యుత్సహంతో గతంలో మాదిరే సీఎం..సీఎం అంటూ నినాదాలు చేస్తుంటే, ఇది మంచి పద్దతి కాదు, ఇలా చేస్తే అది ముఖ్యమంత్రి చంద్రబాబు ను అవమానించినట్టు అవుతుంది అంటూ వారిని వారించారు పవన్.
ఇక టీడీపీ యువనేత లోకేష్ విషయంలో కూడా కొన్ని సందర్భాలలో కాబోయే సీఎం అంటూ పార్టీలో కొంతమంది తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ జాడ్యం వైసీపీ, బిఆర్ఎస్ కార్యకర్తలను తాకింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ చనిపోయిన వారిని పరామర్శించడానికి బయటకొచ్చినా, తమ పార్టీ నేతలను ఓదార్చడానికి జైలుకెళ్లినా ఇక అక్కడ జగన్ ను చూసిన వైసీపీ క్యాడర్ సమయం, సందర్భం లేకుండా సీఎం సీఎం అంటూ అరచి నానా యాగీ చేస్తున్నారు.
అయితే జగన్ మాత్రం ఆ నినాదాలు చేసే వారిని వారించేది పోయి తన చిక్కటి చిరు నవ్వులతో వారిని ప్రోత్సహిస్తూ బలప్రదర్శన చూపిస్తున్నారు. అయితే బిఆర్ఎస్ రజతోత్సవ సభ లో కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆ సభకు విచ్చేసిన కొంతమంది పార్టీ కార్యకర్తలు కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ అరుస్తూ చివరికి అధినేత చేత చివాట్లు తిన్నారు.
ఒక పక్క నేను మాట్లాడుతుంటే ఇటు పక్క సీఎం సీఎం అంటూ మీరు అరవడం ఏంటో.? అసలు మీరు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులేనా.? ఆపండి మీ యాగీ అంటూ కేసీఆర్ తన పార్టీ క్యాడర్ మీద చిరాకు పడ్డారు. తమ అభిమాన నాయకుడి మీద ఉన్న ప్రేమ ను చూపించడానికి పార్టీ క్యాడర్ ఎంచుకుంటున్న ఈ సీఎం సీఎం నినాదాలు పార్టీ ని అధికారంలోకి తీసుకురాదు, అలాగే తమ అధినేత లను ముఖ్యమంత్రిని చెయ్యలేదు అనేది పార్టీ క్యాడర్ గుర్తించాలి.
ఇక నైనా పార్టీ అధినేత దృష్టిలో పడడానికో, వారి మెప్పు కోసమో ఇలా సీఎం పదవిని, ఆ హోదాను ఒక ప్రచార మాద్యమంలా చూడడం మానుకుంటే అధినేతల నుండి ఇటువంటి చివాట్లు తప్పుతాయి.
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…