
వేదికపై ఉన్న వారందరికీ నమస్కారాలతో మొదలైన లక్ష్మీ శ్రీజ ఉపన్యాసం గుక్కతిప్పుకోకుండా ముగిసింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాలు, గతంలో కేసీఆర్ నిర్వహించిన పదవులు, గతంలో చంద్రబాబు రూపొందించిన విజన్ 2020లో తెలంగాణ గురించి లేకపోవడంపై కేసీఆర్ చేసిన బహిరంగ విమర్శలు, చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచినప్పుడు కేసీఆర్ చేసిన విమర్శలు, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, కొన్ని రోజుల తర్వాత ప్రమాదంలో చనిపోవడం, సీఎంగా రోశయ్య ప్రమాణ స్వీకారం, ఫ్రీ జోన్ ఉద్యమం ప్రత్యేక ఉద్యమంగా మారడం, కేసీఆర్ క్యాబినెట్… ఇలా పలు అంశాల గురించి క్లుప్తంగా ఎటువంటి తప్పులు లేకుండా, స్పష్టంగా వేదికపై నుంచి శ్రీజ మాట్లాడింది. దీంతో కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలందరూ చప్పట్లు కొట్టి మరీ చిన్నారిని అభినందించారు. సహజంగా కేసీఆర్ పాల్గొనే సమావేశాల్లో ఆయన ప్రసంగమే హైలైట్ అవుతుంటుంది… కానీ, ఈ సారి మాత్రం ఈ చిన్నారి కేసీఆర్ ను పడగొట్టింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…