
దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణలో ప్రగతిభవన్‌ను శానిటైజేషన్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉండడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారట. రాజధాని ప్రాంతంలో కరోనా విజృంభించడంతో సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అక్కడ నుండే కీలక సమీక్షలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా… మొన్న ఆ మధ్య కరోనా ని అదుపుచెయ్యడానికి జీహెచ్ఎంసి ఏరియాలో మళ్ళీ లాక్ డౌన్ విధించాలని కూడా కేసీఆర్ ఆలోచన చేశారు. అయితే దానివల్ల వచ్చే ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెనక్కు తగ్గారు. ఇది ఇలా ఉండగా నిన్న ఒక్కరోజే తెలంగాణాలో 1,213 కేసులు నమోదు అయ్యాయి.
దీనితో రాష్ట్రంలోని మొత్తం కేసులు 18,570కు చేరాయి. టెస్టు చేస్తున్న ప్రతీ నాలుగు సాంపిల్స్ లో ఒకటి పాజిటివ్ గా తేలడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. తెలంగాణలోని కేసులలో 75% పైగా జీహెచ్ఎంసి ఏరియా నుండి నమోదు అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు 275 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…