
[m9ad]
ఈ దిశగా కేసీఆర్ ఇప్పటికే పని మొదలుపెట్టారని అంటుంది ఒక తెలుగు పత్రిక, ఆంధ్ర రాజీకయలలోకి డైరెక్టుగా వేలు పెట్టకుండా అక్కడి ప్రతిపక్షాలకు సపోర్టు చేసి బాబును ఇరుకున పెట్టాలి అనేది కేసీఆర్ వ్యూహమట. ఏపిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జగన్, పవన్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న స్ఫర్థలను తొలగించి ఒకే వర్గంగా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వైకాపా లేదంటే జనసేన పార్టీకి వెళ్లి టీడీపీకి నష్టం చేకూరుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తుంది.
వీరిద్దరికి తోడు వామపక్ష పార్టీలను కూడా కలిపి ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని ఏర్పాటు చేస్తే చంద్రబాబు ఓటమి ఖాయమని కేసీఆర్ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో ఈ రెండు పార్టీలు దూరంగా ఉండి ఒకరకంగా పరోక్షంగా తెరాసకు మద్దతు ఇచ్చాయి. మహాకూటమి ఓటమే లక్ష్యంగా పని చేశాయి. అయితే ఒక రకంగా ఇది తెలంగాణాలో చంద్రబాబు చేసిన మహాకూటమి ప్రయత్నం వంటిదే. ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రయోగం మన దగ్గర రెండు సార్లు జరిగింది.
2009లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ తప్ప మిగతా అన్ని పక్షాలను ఒక తాటి మీదకు తెచ్చారు చంద్రబాబు. అప్పట్లో చంద్రబాబుతో జతకట్టారు కేసీఆర్ అయితే అప్పుడు విఫలమైన ఈ ప్రయోగాన్ని మళ్ళీ ఇటీవలే తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ మీదే ప్రయోగించారు చంద్రబాబు. కానీ మరోసారి విఫలం అయ్యింది. ఈ సారి దాని వల్ల లాభపడ్డారు గులాబీ దళపతి. ఒకరకంగా ఈ రెండు ప్రయోగాలను చాలా దగ్గర నుండే చూశారు కేసీఆర్. ఈ క్రమంలో ఈ ప్రయోగం ఆంధ్రలో ఏమవుతుందో చూడాలి?
ఇప్పటికే జగన్ అక్రమాస్తులు, వివేక హత్య కేసులలో ఈడీ విచారణ జోరు పెంచింది. తాజాగా నాడు సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలు,…
ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం.…