
రేవంత్ రెడ్డి పేరు చెబితేనే అగ్గిమీద గుగ్గిలమయ్యే కేసీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రేవంత్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్ఛం, ‘దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. మీరు ప్రజాసేవలో మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలి’ అనే మెసేజ్ ఉన్న లేఖను పంపారు.
టీడీపీలో ఉన్నప్పుడు గానీ, అందుకు ముందుగానీ రేవంత్‌కు కేసీఆర్ ఇలా విషెస్ చెప్పిన దాఖలాలు లేవు. పైగా కేసీఆర్ కుటుంబ పాలనా అంతం చెయ్యడం తన జీవిత లక్ష్యం అని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఈ సమయంలో ఈ లేఖ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి రాజీనామా చేసి కొడంగల్ కు ఉపఎన్నిక వస్తే రేవంత్ ను ఓడించి తీరని కృత నిశ్చయంతో ఉన్నారు కేసీఆర్.
2014 తరువాత వచ్చిన అన్ని ఉపఎన్నికలలోను తెరాస ను అవలీలగా గెలిపించిన హరీష్ రావును కొడంగల్ ఇంచార్జి గా నియమించారు గులాబీ దళపతి. కొడంగల్ లో కాంగ్రెస్ ను ఓడిస్తే 2019 ఎన్నికల ముందు ఆ పార్టీ ని చావు దెబ్బ కొట్టినట్టే అని కేసిఆర్ భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాజకీయం మరోసరి వేడెక్కిన ఈ సందర్భంలో కెసీఆర్ రేవంత్ కు బొక్కే పంపడం ఆసక్తికర పరిణామం.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…