Telugu

దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌… అదెలా సాధ్యమబ్బా?

తెలంగాణ సిఎం కేసీఆర్‌ సోమవారం నిజామాబాద్‌ బహిరంగసభలో మాట్లాడుతూ, “కేంద్రంలో రాబోయేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నాను” అని అన్నారు.

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని చాలా తహతహలాడుతున్నారు మంచిదే. గుజరాత్‌లో సిఎంగా చేసిన నరేంద్ర మోడీ ప్రధాని కాగలినప్పుడు నేనెందుకు కాలేనని కేసీఆర్‌ భావిస్తే అది తప్పే. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధాని కాక ముందు నుంచే బిజెపి జాతీయ పార్టీగా చాలా బలంగా ఉంది.

ADVERTISEMENT

కానీ కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలనుకొంటే దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఆయన నాయకత్వాన్ని అంగీకరించాల్సి ఉంటుంది లేదా కేసీఆర్‌ జాతీయపార్టీ పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో పోటీ చేసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన ఎంపీలను సంపాదించుకోవాలి.

ఈ రెండూ సాధ్యం కానివే అని చెప్పవచ్చు. మోడీని గద్దె దింపడానికి ప్రాంతీయ పార్టీలు ఆయనతో కలిసి పనిచేస్తాయేమో కానీ ఆయనకి ప్రధాని పదవి అప్పగించవు. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలలో ఆ పదవి ఆశిస్తున్నవారు కనీసం ఓ డజను మంది ఉన్నారు.

కనుక సొంతంగా జాతీయ పార్టీ పెట్టుకొని రైతు సంఘాల నేతల మద్దతుతో రైతుల ఓట్లు, మజ్లీస్‌ సాయంతో ముస్లింల ఓట్లు, వామపక్షాల మద్దతుతో వాటి ఓటు బ్యాంక్ సంపాదించాలని కేసీఆర్‌ అనుకొంటున్నట్లున్నారు. కానీ ఆయా వర్గాలపై ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలకే పట్టు ఉంటుంది కనుక అదీ సాధ్యం కాదు!

అయితే మోడీ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి అందరినీ కేసీఆర్‌ కూడగట్టగలరు. అన్నీ అనుకొన్నట్లు జరిగితే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి దాని స్థానంలో మరో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. కానీ ప్రధాని కాలేరు!

ప్రధాని తప్ప మరొకరు దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పలేరు. కానీ నిజామాబాద్‌లో కేసీఆర్‌ ప్రకటించేశారు. అదెలా సాధ్యం?

ఒకవేళ ఆయన చెప్పినట్లు రైతు అనుకూల ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వచ్చి, ఆయనే ప్రధానమంత్రి అయినా దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే దానికే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సివస్తుంది. అందుకు భాగస్వామ్య పార్టీలు అంగీకరిస్తాయా?

వివిద రాష్ట్రాలలో అవినీతి, అక్రమాలు, క్రిమినల్ కేసులలో మునిగితేలుతున్న పార్టీలను, వాటిలో పదవీ, అధికార లాలసతో తహతహలాడుతున్న రాజకీయ నాయకులను వెంటబెట్టుకొని కేసీఆర్‌ దేశాన్ని బాగుచేస్తానని చెప్పడం హాస్యాస్పదంగానే ఉంది. అయినా ఓ ఆరు నెలలో ఏడాది ముందో ఢిల్లీకి వెళ్ళి చక్రం తిప్పేసి ప్రధానమంత్రి అయిపోవడం సాధ్యమేనా?కనుక కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించగలరేమో కానీ ఆయన చెప్పినవేవీ సాధ్యం కావు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas’ Re-Release $13.5: Why US Tickets So Expensive?

Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…

1 hour ago

Karthik Subbaraj’s Dorothy: Will Netflix Release Spark Fresh Controversy?

Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…

2 hours ago