
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేస్తున్న పోతిరెడ్డిపాడు కొత్త ప్రాజెక్టు మీద ఫిర్యాదు చేస్తే, జగన్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కంప్లయింట్ చేసింది. దీనితో జలవివాదాలపై కేంద్రం ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం త్వరలో జరగనుంది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాలు, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు సమాచారం పంపింది.
కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు కేంద్ర జల్ శక్తి శాఖ అండర్ సెక్రటరీ ఎ.సి. మల్లిక్ లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశ అజెండా కోసం అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలను కోరింది.
చంద్రబాబు వంటి కామన్ శత్రువు జగన్, కేసీఆర్ ని కలిపారు. అయితే ఈ వివాదం పరిష్కరించే సమయంలో సొంత రాష్ట్రంలోని రాజకీయ అవసరాలు అడ్డువస్తాయి. దానితో జగన్, కేసీఆర్ ల మధ్య జరగబోయే మొట్టమొదటి పంచాయితీ ఎలా నడుస్తుంది అనేది చూడాల్సి ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ శ్రేణులు చాలా ధైర్యంగా పోరాడుతున్నారనే జగన్ మాట పై ఎటువంటి సందేహమూ లేదు. ప్రతిపక్షంలోకి…
The TDP-Jana Sena alliance has witnessed unexpected developments in candidate selection for the Andhra Pradesh…