
YSRCP's Political Strategy Tests TDP
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ శ్రేణులు చాలా ధైర్యంగా పోరాడుతున్నారనే జగన్ మాట పై ఎటువంటి సందేహమూ లేదు. ప్రతిపక్షంలోకి మారినా మూడు పార్టీలను వైసీపీ బలంగా ఢీ కొంటోంది. నో డౌట్!
మరోపక్క సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తూ ఎన్నికల ప్రక్రియకు బ్రేకులు కూడా వేయగలిగింది. టీడీపీ శ్రేణులు, పోలీసులతో ఘర్షణలు పడుతూ, ఈ ఎన్నికల ప్రక్రియలో తామే బాదితులమని చాలా తెలివిగా ప్రాజెక్ట్ చేసుకోగలుగుతుంది.
పనిలో పనిగా టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని గట్టిగా ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అలాగే జనసేనకు తీరని అన్యాయం జరిగిందని ఆ పార్టీ శ్రేయోభిలాషుల ముసుగులో మొసలి కన్నీళ్ళు కార్చుతూ జనసైనికులను బాగానే రెచ్చగొట్టగలిగింది.
ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు వైసీపీలో పలువురు సీనియర్లు, వారి బందుమిత్రులు ఆర్థిక, రాజకీయ కారణాలతో పోటీ చేసేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు టీడీపి శ్రేణులు దౌర్జన్యాలు చేస్తుండటం వల్లనే వారందరూ నామినేషన్స్ వేయలేకపోయారని కొత్త వాదన వినిపిస్తోంది. అంటే వైసీపీ ఎంత తెలివిగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
కడప జిల్లాలో వైసీపీ అభ్యర్ధులు ఓడిపోతే, ఆ అపకీర్తి జగన్ మెడకు చుట్టుకుంటుంది. కనుక ప్రొద్దుటూరులో 31,33,39వ వార్డులో నామినేషన్స్ వేసిన శివకుమారి, నాగ చైతన్య కుమారి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భార్య రమాదేవి నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు. ఇంకా వివిధ మున్సిపాలిటీలలో కూడా ఇదే పరిస్థితి.
కనుక ఈ ఎన్నికలలో టీడీపి మిత్రపక్షాలు మెజార్టీ సీట్లు సాధించుకున్నప్పటికీ, వైసీపీ అమలు చేస్తున్న ఇటువంటి వ్యూహాలతో వాటికి ఎప్పటికీ తీరని అప్రదిష్ట మిగిలిపోతుందని చెప్పక తప్పదు.
కనుక ఎన్నికలప్పుడు ఏవిధంగా రాజకీయాలు చేయాలో వైసీపీ నుంచి టీడీపీ, జనసేన రెండు పార్టీలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.
The TDP-Jana Sena alliance has witnessed unexpected developments in candidate selection for the Andhra Pradesh…
One big film can change the release plans of several smaller films. The latest example…