
అందుకే టిడిపి మునుగోడు ఉపఎన్నికలలో టిడిపి పోటీ చేయాలనుకొన్నా సమస్యే, పోటీ నుంచి విరమించుకొన్నా వారికి సమస్యే! తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎందుకు వేలుపెడుతున్నారంటూ సొంత బాకా మీడియాతో అడిగిస్తుంటారు. అయితే టిఆర్ఎస్కు కోరుకొన్న సమాధానాన్ని ఆ పత్రిక చెప్పుకొన్నప్పటికీ, అసలు కారణం టిఆర్ఎస్ నేతలందరికీ కూడా తెలుసు.
తెలంగాణలో చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాలలో పాల్గొనే అవకాశం కల్పించింది తమ అధినేత కేసీఆర్ బిఆర్ఎస్తో ఏపీలో ప్రవేశించాలనుకోవడమే కారణమని అని వారూ గ్రహించారు. కనుక తెలంగాణలో టిడిపిని చంపేసిన కేసీఆరే మళ్ళీ దానికి ప్రాణం పోసి బ్రతికించారని టిఆర్ఎస్ నేతలు సైతం భావిస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో టిడిపిని దాని అధినేత చంద్రబాబు నాయుడుని టిఆర్ఎస్ అడ్డుకొనే ప్రయత్నాలు చేసినట్లయితే, ఏపీలో కూడా బిఆర్ఎస్ను టిడిపి తప్పకుండా అదేవిదంగా అడ్డుకోగలదని టిఆర్ఎస్ నేతలు ఈపాటికే గ్రహించి ఉంటారు.
కేసీఆర్ తన బిఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించి అక్కడ పోటీ చేయాలనుకొంటే తప్పు కానప్పుడు, మొదటి నుంచి ఉన్న టిడిపి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రాజకీయాలు చేయకూడదు?అనే టిడిపి ప్రశ్నకు టిఆర్ఎస్ ఏవిదంగా సమాధానం చెప్పాలా అని ఇంకా ఆలోచించుకొంటోంది. ఏది ఏమైనప్పటికీ దేశ రాజకీయాలలో ‘గుణాత్మకమైన మార్పు’ తెస్తానని బయలుదేరుతున్న కేసీఆర్, టిడిపిని తెలంగాణలో రాజకీయాలు చేయొద్దని చెప్పగలరా?చెపితే ఆ గుణనాత్మకమైన మార్పు కేసీఆర్ నుంచే మొదలవ్వాలని టిడిపి గుర్తు చేయకుండా ఉంటుందా?
Retired IPS officer AB Venkateswara Rao is set to contest the Vijayawada Municipal Corporation mayoral…
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…