Telugu

‘సమంత’ ఉన్నా అందరి చూపులు ‘సురేష్’ వైపుకే!

‘నేను శైలజ’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ నటించిన మొదటి సినిమా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ‘నందిని నర్సింగ్ హోం’ ద్వారా వెండితెరకు పరిచయమైన నరేష్ తనయుడు నవీన్ హీరోగా ప్రారంభించిన మొదటి సినిమా ద్వారా కీర్తి టాలీవుడ్ కు పరిచయం కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా ఆగిపోవడంతో రామ్ సినిమాతో రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ, తాజాగా ‘రెమో’తో మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.

ADVERTISEMENT

తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల సందర్భంగా హాజరైన కీర్తి సురేష్ ను చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కయ్యాయట. ఎల్లో కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతున్న కీర్తి అవుట్ లుక్ తో తెలుగు దర్శక నిర్మాతల చూపులు ఈ బ్యూటీపై పడ్డట్లుగా ట్రేడ్ టాక్. ఈ వేడుకకు టాప్ హీరోయిన్ సమంత హాజరైనప్పటికీ అందరి కళ్ళు కీర్తి వైపుకే ఉన్నాయంటే, ఏ రేంజ్ లో తన అందంతో కట్టిపడేసిందో అర్ధం చేసుకోవచ్చు. సంప్రదాయమైన దుస్తుల్లో కీర్తి అలా మెరిసిపోతుంటే, టాలీవుడ్ కు మరో టాప్ హీరోయిన్ దొరికినట్లేనని చెవులు కొరుక్కోవడం సినీ జనాల వంతవుతోంది.

అసలే తెలుగులో హీరోయిన్ల కొరత ఓ రేంజ్ లో ఉండడంతో… ఇలా కీర్తి రూపంలో అందం, అభినయం కలగలిపిన హీరోయిన్ లభించడం దర్శకనిర్మాతలకు పండగే కదా! కాజల్, సమంతలు రిటైర్మెంట్ స్టేజ్ కు వచ్చేయడం, తమన్నాకు సక్సెస్ రేట్ లేకపోవడంతో, ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కటే దర్శకనిర్మాతలకు ప్రధాన చాయిస్ గా మారిన తరుణంలో… మరో ఆప్షన్ గా నేనున్నానంటూ కీర్తి సురేష్ లుక్స్ చెప్పినట్లయ్యింది. అంత అందంగా ఉంది కాబట్టే ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ పసుపు చీర కట్టుకున్న కీర్తి ఫోటోలు ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Will Raaka Make a Grand Entry With Shah Rukh’s King?

Allu Arjun and Shah Rukh Khan could be heading for an interesting big-screen connection, even…

12 minutes ago

King 100 vs Dada: Who Will Rule Christmas?

Tollywood's Christmas season turns into a Nandamuri-Akkineni battleground. Balakrishna's Dada and Nagarjuna's King 100 are…

42 minutes ago