Telugu

‘సావిత్రి’ మారింది… పవన్ ముద్దుగుమ్మ వచ్చింది..!

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించబోయే సినిమా “సావిత్రి” టైటిల్ రోల్ లో ఎవరు కనిపించబోతున్నారు? ఇటీవల సమంత, నిత్యామీనన్ పేర్లు బాగా హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో సమంత దాదాపుగా ఖరారైందన్న టాక్ బలంగా వినపడింది. అయితే సమంత టైటిల్ రోల్ కాదు, ఓ కీలక పాత్ర మాత్రమే చేస్తోంది, టైటిల్ రోల్ లో నిత్యామీనన్ దర్శనమివ్వనుంది అన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా వీరిద్దరి పేర్లు వెనక్కి వెళ్లి, త్వరలో పవన్ కళ్యాణ్ సరసన నటించబోయే హీరోయిన్ పేరు వెలుగులోకి వచ్చింది.

అవును… ‘నేను… శైలజ…’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ కీర్తి సురేష్, ‘సావిత్రి’ టైటిల్ రోల్ లో నటించబోతుందని లేటెస్ట్ సమాచారం. ‘నేను లోకల్’ సినిమాలో నాని సరసన కనిపించనున్న కీర్తి, ఆ తర్వాత త్రివిక్రమ్ – పవన్ కాంబోలో సినిమాకు కూడా సైన్ చేసిన విషయం తెలిసిందే. ఇంతలో ఈ ‘సావిత్రి’ బయోపిక్ కు ఎంపిక కావడం అనేది నెంబర్ 1 స్పాట్ బరిలో కీర్తి సురేష్ ఉందన్న సంకేతాలను సినీ జనాలు వ్యక్తం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘సావిత్రి’ సినిమాను అశ్వనిదత్ బ్యానర్ నుండి నిర్మాణం అవనుంది.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Shruti Haasan Draws The Line On AI Misuse

For an actor, a face and voice are more than just part of their identity.…

19 minutes ago

I’m Game Review: Dead Game!

BOTTOM LINE Dead Game! RATING 1.75/5 Director: Nahas Hidhayath Story, Screenplay: Nahas Hidhayath, Sajeer Baba…

32 minutes ago