ఓవారం ముందే వస్తున్న మోస్ట్ హేటెడ్ సినిమా

వారానికి అన్ని భాషలు కలుపుకొని కనీసం ఆరేడు సినిమాలు వస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే గుర్తుంటాయి, మిగతా వాటిని జనాలు కనీసం పట్టించుకోరు. కానీ.. ఈమధ్యకాలంలో టీజర్ & ట్రైలర్ రిలీజ్ నుండే తారాస్థాయిలో హేట్రెడ్ సంపాదించుకొని, రిలీజ్ టైంలో కూడా అదేస్థాయిలో ట్రోల్ అయిన సినిమా “ది కేరళ స్టోరీ 2”.

పార్ట్ 1 ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగా.. పార్ట్ 2 మాత్రం కేరళ రాష్ట్రం అసలు పట్టించుకోలేదు. ఆ ఇండస్ట్రీ వాళ్లు కూడా కేరళ స్టోరీ మీద ఘాటుగానే స్పందించారు. బాక్సాఫీస్ దగ్గర కూడా పార్ట్ 2 అంత హడావుడి చేయలేకపోయింది. ఓ మోస్తరు థియేట్రికల్ రన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ADVERTISEMENT

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వెర్షన్ తొలుత మే 8న రిలీజ్ కోసం ప్లాన్ చేయగా.. ప్రస్తుతం థియేటర్లలో అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయకపోవడంతో ఓటీటీ రిలీజ్ నీ ఒకవారం ముందుకు పుష్ చేసి మే 1న జీ5 యాప్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఎలాగు ఓటీటీ రిలీజ్ తర్వాత సినిమా క్లిప్పింగులన్నీ వైరల్ అవుతాయి కాబట్టి, కేరళ ప్రజానీకం ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనేది చూడాలి.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Koratala with Balakrishna: Time for Revenge on Boyapati?

The latest reports in Tollywood suggest that Koratala Siva is set to direct Nandamuri Balakrishna.…

19 minutes ago

కేటీఆర్…ఇండస్ట్రీని రేవంత్ కి దూరం చెయ్యాలనుకుంటున్నారా.?

తెలంగాణ రాజకీయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి vs బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టుగా సాగుతున్నాయి. రేవంత్ పోవాలి కేసీఆర్…

25 minutes ago