
మన దేశంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎవరు ముందుంటారు? అంటే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పేరే టక్కున చెపుతారు చాలా మంది. అలాగే సాఫ్ట్‌వేర్ నిపుణులలో అత్యధికంగా ఏ రాష్ట్రానికి చెందినవారు? అంటే ఆంధ్రప్రదేశ్ పేరే చెప్పుకుంటారు.
కానీ దశాబ్దాలుగా కాంగ్రెస్, సిపిఐ పార్టీలు, వాటి ప్రభుత్వాల దృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోతున్న కేరళ రాష్ట్రం ఈ విషయంలో మనకంటే చాలా ముందుందనిపిస్తుంది. అందుకు ఇదో చిన్న ఉదాహరణ.
కేరళ రాష్ట్రంలో కంజిరప్పుజ అనే చిన్న పట్టణంలో ‘హ్యూమనాయిడ్ రోబోట్’ని బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో రోడ్డుపై పరీక్షించారు.
దానికి ఇద్దరు ఇంజనీర్లు కాస్త తోడ్పడినప్పటికీ, అది తనంతట తానుగా రోడ్డుపై నడుస్తూ, రోడ్డుపై చేపలు అమ్మేవారితో, బస్టాండులో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులతో అచ్చమైన మలయాళం భాషలో, యాసలో మాట్లాడింది.
తర్వాత జీబ్రా లైన్స్ మీదుగా రోడ్ క్రాస్ చేసింది. దీనిని కేరళ పోలీస్ శాఖ కోసం ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. కనుక పోలీస్ రోబోట్ అని చెప్పవచ్చు.
అయితే కేరళ పోలీస్ శాఖ 2019లోనే రెసిప్షన్ పనుల కోసం ఓ రోబోట్ తయారు చేయించుకొని వాడుకుంటోంది. అలాగే మురుగు కాలువలు క్లీన్ చేయడానికి, ప్రమాదకరమైన మెడికల్ వేస్ట్ ఎత్తివేయడానికి రోబోట్స్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు పరీక్షించిన ఈ పోలీస్ రోబోట్ ట్రాఫిక్ నియంత్రణకి ఉపయోగించబోతున్నట్లు సమాచారం.
ఇది ఏఐ సాంకేతికతతో ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ తనంతట తానుగా పని చేస్తుంది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉన్నట్లు?
Many thought Bigg Boss 20 would not be as interesting as the earlier seasons, especially…
For the first time in Bigg Boss history, there is a double eviction in the…