
అయితే 24 గంటలు గడవకముందే సీన్ మారిపోయింది. చంద్రబాబు ఇచ్చిన పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరించారు కేశినేని నాని. తనకు ఆ పదవులు అవసరం లేదని, తనకు అంత పెద్ద పదవులు నిర్వహించే సామర్థ్యం లేదన్నట్లుగా పోస్ట్ పెట్టారు. తన కంటే గొప్ప సామర్థ్యం ఉన్న వారికి.. ఆ పదవులు ఇవ్వాలని అధినేతకు వ్యంగ్యంగా సూచించారు. అయితే బీజేపీలో చేరుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన తనకు ఆ అవసరం లేదని చెప్పడం విశేషం.
పార్లమెంటరీ పార్టీ నేత పదవి కోసం కేశినేని నాని ఆశలు పెట్టుకున్నారు. అయితే గత లోక్ సభలో పార్టీ తరపున గట్టిగా గళం విప్పిన గల్లా జయదేవ్‌కు ఆ పదవి అప్పగించారు. లోక్‌సభలో.. పార్టీ నేత పదవిని రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు. దీంతో కేశినేని నాని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయనకు నచ్చజెప్పడానికి గల్లా జయదేవ్ ఆయన వద్దకు వెళ్లారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీ కేవలం మూడంటే మూడే ఎంపీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలయ్యి పక్షం రోజులు కూడా కాకముందే టీడీపీలో ముసలం మొదలయ్యింది.
Hai Jawani Toh Ishq Hona Hai, starring Varun Dhawan, Pooja Hegde, and Mrunal Thakur, has…
CM Vijay is proving that "elevation" isn’t just about winning elections; it’s about how you…