
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా మిగిలిన పని పూర్తి చేసి ఓపెనింగ్ కు సిద్ధం అయ్యింది. అయితే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం తమ ఘనతే అంటూ అధికార పార్టీ ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం చేసుకునే ప్రయత్నం చెయ్యడం గమనార్హం. జగన్ చేతుల మీదుగా ఘనంగా ఓపెనింగ్ చెయ్యాలనుకున్నారు.
ఈ తరుణంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఝలక్ ఇచ్చారు. దానిని ఓపెన్ చెయ్యాల్సిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించారు. దానితో వైఎస్సార్ కాంగ్రెస్ తన స్పీడ్ తగ్గించక తప్పలేదు. ఈ ప్రాజెక్టు పై నాని విశేషంగా దృష్టిపెట్టారు. అప్పట్లో నితిన్ గడ్కరీతో తనకు ఉన్న పరిచయంతో దానిని శాంక్షన్ చేయించుకున్నారు.
కనకదుర్గ ఫ్లై ఓవర్ ఈ నెల 18న ప్రారంభం కాబోతుంది. నితిన్ గడ్కరీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. రాజకీయ సంగతులు ఎలా ఉన్నా… విజయవాడలోని ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…