
కేజీఎఫ్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. దాదాపుగా 80% పూర్తి అయ్యిందని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చ్ లో అన్ని భాషలలో ఒకేసారి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రశాంత్ నీల్ కన్ను టాలీవుడ్ మీద పడిందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. వాటిని ఎవరూ ఇప్పటిదాకా ధృవీకరించలేదు.
కాకపోతే ప్రశాంత్ నెలకోసారి ఆ హీరోతో పని చెయ్యబోతున్నాడు ఈ హీరోతో చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ముందుగా ఎన్టీఆర్ తో అన్నారు, ఆ తరువాత మహేష్ బాబు అన్నారు, ఇప్పుడు ప్రభాస్ అంటున్నారు. అంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడికి ఏ స్టారైనా డేట్స్ ఇస్తాడు. అంతమంది దగ్గరకు తిరగనవసరం లేదు.
మరి తెరవెనుక ఏం జరుగుతుందో. లేక ఇవన్నీ గాలి వార్తలో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా కేజీఎఫ్ 2 మొదటి భాగాన్ని మించి యాక్షన్, మాఫియా ఉంటాయట. యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్‌లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. కోలార్ గోల్డ్ మైన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన సూర్యవర్ధన్ బ్రదర్ గా సంజు బాబా కనిపించబోతున్నాడు.
తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో బీఆర్ఎస్ పార్టీ నిత్యం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నామస్మరణ…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan have reportedly…