
మరి ఇంతకీ ఫస్ట్ డే ఏ సినిమాను ‘ఖైదీ నంబర్ 150’ టార్గెట్ చేసింది? అంటే టాలీవుడ్ సింహాసనంపై కూర్చున్న “బాహుబలి” సినిమాను అన్న టాక్ వినపడుతోంది. అవును… ఏకంగా ‘బాహుబలి’ కలెక్షన్స్ ను కొల్లగొడుతుందన్న ఆశలు మెగా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. అన్ని ఏరియాల్లో జరుగుతున్న ముందస్తు బుకింగ్స్ ఈ రికార్డులను ఊరిస్తున్నాయి. అయితే ఫస్ట్ డే విషయంలో ‘బాహుబలి’ని బీట్ చేసినా… లాంగ్ రన్ లో ‘బాహుబలి’ రికార్డుల దరిదాపుల్లోకి రావడం ‘ఖైదీ నంబర్ 150’కి అసాధ్యమైన విషయం.
కానీ, నెంబర్ 2 స్పాట్ లో ఉన్న “శ్రీమంతుడు” కలెక్షన్స్ ను లాంగ్ రన్ లో అందుకోవడమే ‘ఖైదీ’ లక్ష్యం. సినిమా మంచి టాక్ వస్తే ఖచ్చితంగా ‘శ్రీమంతుడు’ రికార్డులు చెరిగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే… సంక్రాంతి పండగ సెలవుల కలెక్షన్స్ రీత్యా, ఆ తర్వాత మరో నెల రోజుల వరకు కూడా ఏ పెద్ద సినిమా విడుదల లేకపోవడంతో ‘ఖైదీ’కి ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ సినిమాకు ‘యావరేజ్’ టాక్ వచ్చినా గానీ, మెగా ఫ్యాన్స్ లో ‘ఖైదీ’ సినిమాకున్న క్రేజ్ రీత్యా ‘శ్రీమంతుడు’ రికార్డులు అవుట్ డేటెడ్ అయిపోయే సంకేతాలు కనపడుతున్నాయి.
ఒక్క దారుణమైన టాక్ వస్తే తప్ప ‘ఖైదీ’ సినిమా నెంబర్ 2 స్పాట్ లో కూర్చోవడం తధ్యం అని మెగా ఫ్యాన్స్ మానసికంగా ఫిక్స్ అయిపోయిన నేపధ్యంలో… మరి మెగాస్టార్ సిల్వర్ స్క్రీన్ పై అభిమానులను ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. పదేళ్ళ గ్యాప్ రావడంతో, బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను మరోసారి నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత మెగాస్టార్ కు కూడా వచ్చింది మరి!
Following the terrible failures of Indian 2 and Thug Life, Kamal Haasan has still not…
Manjari Fadnnis is setting screens ablaze with a spellbinding beachside photoshoot drenched in pure golden…