Telugu

ఖైదీ ట్రైలర్: నో రొమాన్స్ ఓన్లీ యాక్షన్

తమిళ నటుడు కార్తీ తాజా సినిమా ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదలైంది. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమా పూర్తిగా డ్రగ్ మాఫియా నేపథ్యంగా, కొంత ఫ్యామిలీ సెంటిమెంట్‌తో సాగుతున్న థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. కార్తీ పూర్తిగా మాస్ లుక్‌లో అదరగొట్టాడు. ట్రైలర్‌లో ‘దిల్లీ’ అనే ఖైదీ పాత్రలో కార్తీ నటించాడు.

ట్రైలర్‌లో కార్తీ ‘పదేళ్లు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికెళ్లే ముందు ఏం చేసేవాడినో మీకు తెలీదు కదా సార్‌‌’ అంటూ చెప్పిన డైలాగులు మాస్‌ను ఆకట్టుకోనున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ పూర్తీగా యాక్షన్‌ ప్రియులను అలరించే విధంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గానీ, రొమాన్స్ గానీ, పాటలు గానీ ఉండవని కార్తీ తెలిపాడు.

ADVERTISEMENT

కథ అంతా ఒక రాత్రి జరుగుతుందని ట్రైలర్ ద్వారా అర్ధం అవుతుంది. సినిమాలోని యాక్షన్ పార్ట్, కెమెరా వర్క్ అదిరిపోయాయి. అయితే ట్రైలర్ చుసిన వారికి సినిమాలో ఉన్న మొత్తం విషయాన్నీ ఎటువంటి సస్పెన్స్ లేకుండా బయటపెట్టేశారా అనే అనుమానాలు కలగకమానదు. ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా డ్రీమ్ వారియర్ పిక్ఛర్ సంస్ధ నిర్మిస్తోంది.

ఖైదీని దీపావళికి విడుదల చేయాలనీ చూస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. తెలుగు, తమిళ బాషలలో ఒకేసారి విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే దీపావళికి విజయ్ బిజిల్ (విజిల్ తెలుగులో) కూడా విడుదల కావడంతో పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. తెలుగులో వెంకీ మామ వాయిదా పడటంతో పెద్దగా మనవైపు నుండి పోటీ ఉండదనే చెప్పుకోవాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Varam Review: A Quirky, Low-Stakes Fantasy

BOTTOM LINE A Quirky, Low-Stakes Fantasy PLATFORM JioHotstar RUNTIME 1 Hour What Is the Show…

8 minutes ago

Bunny Vas Has a Strong Message for AI Trolls

Producer Bunny Vas has a message for youngsters who are trolling the use of Artificial…

52 minutes ago