
గురువారం ప్రసాద్స్ లో మీడియాకు ప్రీమియర్ వేశారు. నాగ చైతన్య చీఫ్ గెస్ట్ వచ్చారు.
సహజంగా ఇటువంటి వాటికి చైతన్య వంటి సెలబ్రిటీలు కనిపించి వెళ్ళిపోతారు. కాకపోతే చైతన్య కూర్చుని సినిమా చూశారు.
అయితే ఇంటర్వెల్ లో ఖుషి ట్రైలర్ వేశారట. ఖుషి సినిమా చైతన్య ఎక్స్-వైఫ్ సమంత సినిమా కావడం తో క్రౌడ్ లో చిన్నపాటి కలకలం.
ఆపరేటర్ వెంటనే పసిగట్టి రెండు స్క్రీన్స్ కే ఆపేశారు. ఆపేసి సలార్ టీజర్ వేశారట.
మరి అది నచ్చక వెళ్లిపోయాడో… ఇంకో కారణంగానో తెలీదు గానీ… సెకండ్ హాఫ్ చూడకుండానే చైతన్య వెళ్లిపోయారట.
ఇప్పుడు సినిమాకు వచ్చిన మీడియాలో ఇదే హాట్ టాపిక్.
సమంత ను గురించిన డిస్కషన్ నాగ్, నాగ చైతన్య ఉండగా రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ వచ్చినా చైతన్య చాలా హుందాగానే తనని తాను క్యారీ చేసుకున్నాడు. ఇక్కడ కూడా అదే జరిగి ఉండవచ్చు.
కాకపోతే చైతన్య – సమంత ఇష్యూ ఎప్పుడూ హాట్ టాపికే కాబట్టి అలా నడుస్తుంది.
చిత్రం: రణబాలి M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: అక్టోబర్ 16, 2026 తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న,…
Keerthy Suresh hasn’t had the best run at the box office lately. Her recent films…