Telugu

మహేష్, కొరటాలను ఫాలో అవుతున్న హీరోయిన్!

‘శ్రీమంతుడు’ జోడి అయిన కొరటాల శివ – ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి “భరత్ అనే నేను” సినిమా కోసం జత కట్టనున్న విషయం తెలిసిందే. జూన్ లో మొదలు కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు అనేది అధికారికంగా ఇప్పటివరకు ఖరారు కాలేదు. అయితే బాలీవుడ్ సుందరాంగి కియారా అలియా అద్వాని నటిస్తోందంటూ ఇటీవల పుకార్లు షికారు చేసాయి. ఈ వార్తను కొరటాల అండ్ కో సమర్ధించలేదు, అలాగని ఖండించలేదు.

కానీ తాజాగా సోషల్ మీడియాలో అద్వాని ట్విట్టర్ ఖాతాను పరిశీలిస్తే… “భరత్ అనే నేను” కోసం ఈ బ్యూటీ ఎంపికైందన్న విషయం ఖరారవుతోంది. ఈ సినిమాలో హీరో అయిన ప్రిన్స్ ను, దర్శకుడు కొరటాల శివను, సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ను ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ లేటెస్ట్ గా యాడ్ చేసుకుంది. దీంతో “భరత్ అనే నేను” సినిమాలో నటిస్తోంది అన్న విషయం పరోక్షంగా చెప్పకనే చెప్తోందన్న మాట. బహుశా సినిమా ప్రారంభ సమయంలో చిత్ర యూనిట్ కూడా అధికారికంగా డిక్లేర్ చేస్తుందేమో!

ADVERTISEMENT

మొత్తానికి ఒక హీరోయిన్ ఎంపిక పూర్తయ్యిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారన్న ప్రచారం జరగడంతో, మరో బ్యూటీ ఎవరో చూడాలి. సాధారణంగా మహేష్ నటించే సినిమాలలో ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంటుంది. కధ డిమాండ్ చేసిందేమో గానీ, ఈ సినిమాలో ఇద్దరు కనువిందు చేయనున్నారన్న ప్రచారం జరిగింది. జూన్ లో మొదలైన షూటింగ్ ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లానింగ్ లో ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Nimrit Kaur Flaunts Sultry Grace In Blue Saree

Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…

11 minutes ago

Romanchakam Review: Thin Story, Patchy Laughs

BOTTOM LINE Thin Story, Patchy Laughs RATING 2/5 Story, Screenplay, Director: Venu Gopal Reddy Cast:…

32 minutes ago