
దీంతో మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిన సంఘటన విషాదంగా మారిపోయింది. కన్నడ స్టార్ హీరో సుదీప్ కొత్త సినిమా ‘హెబ్బులి’ విజయయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా… సోమవారం (కర్ణాటక) తుముకూరులోని గాయత్రీ థియేటర్ కు వచ్చాడు. సహజంగానే సుదీప్ కున్న క్రేజ్ రీత్యా చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓ హోటల్‌లో పనిచేసే 45 సంవత్సరాల శశిధర్ కు కూడా సుదీప్ అంటే చెప్పలేనంత అభిమానం. దీంతో సుదీప్‌ను తిలకించేందుకు ధియేటర్ కు వెళ్లి సందడి చేశాడు.
ఏకంగా సుదీప్ తో కరచాలనం చేసి ఆత్మీయంగా హత్తుకున్నాడు. అభిమాన హీరోను ఆలింగనం చేసుకున్న ఆనందంలో ఇంటికి వెళ్తున్న శశిధర్ మార్గ మధ్యంలో గుండెపోటుతో కుప్పకూలాడు. దీనిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపుగానే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తుముకూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతకాలం నుండి తన అభిమాన హీరోను కలుసుకోవాలని అనుకున్నాడో గానీ, కలుసుకున్న కొద్ది నిముషాలకే అనంత లోకాలకు వెళ్ళిపోవడం విస్తుపోయే సంఘటనగా మారింది.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…