
తనకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఏపీలో జగన్ పాలన తీరు గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు “ఇలా రోడ్డు మీద నిలుచొని మాట్లాడే అంశం కాదిది. గంటల తరబడి మాట్లాడాల్సిన అంశం ఇది,” అంటూ ముగించారు.
కిరణ్ కుమార్ రెడ్డి తాను ఏ రాష్ట్రంలోనైనా పనిచేయడానికి సిద్దమని చెపుతున్నప్పటికీ, ఆయన విజయవాడ వచ్చి సోమూ వీర్రాజుతో భేటీ అయినందున, ఏపీ బిజెపి కోసం పనిచేయబోతున్నారని స్పష్టమైంది. ఏపీ బిజెపి దాదాపు నిద్రాణస్థితిలో ఉంది. కనుక ముందుగా దానిని నిద్రలేపి చలనం తీసుకురావలసి ఉంటుంది.
తర్వాత ఏపీలో బిజెపి బలం, బలహీనతలను బేరీజు వేసి చూసుకోవాలి. దానిని బట్టి జనసేనతో పొత్తులు అవసరమా కాదా? అని తేల్చుకోవాలి. సిఎం జగన్మోహన్ రెడ్డి ఎన్డీయేలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న మాట నిజమైతే, అది అవసరమో కాదో… మంచిదో… కాదో తేల్చుకోవాలి. వీటిని బట్టి వైసీపీ, టిడిపి, జనసేనలను ఏవిదంగా హ్యాండిల్ చేయాలో నిర్ణయించుకోవాలి.
రాష్ట్ర వ్యాప్తంగా వివిద కులాలు, వర్గాల ప్రజలను, ఇతర పార్టీల నేతలను ముఖ్యంగా కాంగ్రెస్, వైసీపీలో రెడ్లను, టిడిపి, వైసీపీలలో బీసీ నేతలను ఏవిదంగా ఆకట్టుకోవాలో ఆలోచించుకోవాలి.
నిజానికి సోమూ వీర్రాజుతో సహా రాష్ట్ర బిజెపి నేతలందరూ వీటన్నిటిపై ఇప్పటికే కొన్ని నిశ్చితాభిప్రాయాలు కలిగే ఉంటారు. కానీ అభిప్రాయాలు ముఖ్యం కాదు… హోమ్ వర్క్ ముఖ్యం. ఒకవేళ వారు చేసి ఉండకపోతే కిరణ్ కుమార్ రెడ్డి చేయాల్సి ఉంటుంది.
ఇవన్నీ రాజకీయ కోణంలోవి కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించి, అమరావతి, పోలవరం, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతుల కల్పన, అప్పులు, ఆదాయం, విభజన హామీలు వంటి సమస్యలన్నిటికీ బిజెపి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పవలసి ఉంటుంది.
కనుక కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీలో పూలబాట పరిచి సిద్దంగా ఉందనుకోలేము. కానీ ఇలా ఒకరి తర్వాత ఒకరు అనుకోని అతిధులు ఊడిపడి, ప్రజలను, ఓట్లను చీల్చుకొంటుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందలేదు. ఎప్పటికీ రాజకీయ ప్రయోగశాలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.
After Dragon, NTR is expected to join hands with Trivikram Srinivas for GOW. However, a…
Vidya Balan has revealed that missing the chance to play legendary Carnatic singer M.S. Subbulakshmi…