
విభజన చట్టం పాసైన తరువాత కూడా తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారని, ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం భావ్యం కాదని, ఆ మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్ల తరఫు న్యాయవాది అన్నారు. రాష్ట్ర విభజన సమాజ స్ఫూర్తికి భిన్నంగా జరిగిందని, సమాజానికి విఘాతం కలిగించారని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ… రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు కావస్తోందని, ఈ దశలో తాము చేయగలిగింది ఏముందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం రాష్ట్ర విభజనపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న సుప్రీంకోర్టు ఒక్కసారిగా విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వార్త ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
నేడు రాష్ట్రమంతటా జరుగుతున్న పోలింగ్ ఒక ఎత్తు అయితే పులివెందుల పోలింగ్ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్లు సాగుతోంది. ఎక్కడికక్కడ…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి “చొక్కా మడత పెడతా.. పులివెందులలో ఓటు వేస్తా... ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి చూస్తానంటూ..” రెండు…