
2019, 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు సంస్థలు జరిపిన సర్వేలలో వాస్తవానికి చాల దగ్గర ఉన్న సర్వే KK సర్వే. నేడు వైసీపీ 151 సీట్ల విజయ కేతనానికి, నాడు 164 సీట్ల కూటమి ఘన విజయానికి అద్దం పట్టింది KK సర్వే.
దీనితో ఈ సర్వే సంస్థ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే ఇంతటి పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ సర్వే సంస్థ తాజాగా జరిగిన తెలంగాణ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బిఆర్ఎస్ కు అనుకూలంగా ఇచ్చింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో బిఆర్ఎస్ తిరుగులేని విజయం సాధిస్తుందంటూ KK సర్వే నివేదిక ఇవ్వడంతో ఆ సర్వే సంస్థకు ఉన్న గత చరిత్ర దృష్ట్యా బిఆర్ఎస్ క్యాడర్ ఆ పార్టీ గెలుపు పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉండవచ్చు.
అయితే నిన్న విడుదలైన జూబ్లీహిల్స్ ఫలితాలతో KK సర్వేను విశ్వసించిన అనేకమందికి నిరాశే ఎదురయ్యింది. దీనితో ఇప్పటి వరకు ఉన్న KK సర్వే క్రెడిబిలిటీ కూడా పుర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది.
ఇలా ఒక పేరు పొందిన సర్వే సంస్థల అంచలనాలకు అనుగుణంగా ఎంతోమంది బెట్టింగ్ రాజాలు పలానా పార్టీ గెలుస్తుంది అంటూ వేల నుంచి లక్షలలో బెట్టింగులు పెట్టి చివరికి ఆర్థికంగా చేతులు కాల్చుకుంటున్నారు.
ఈ సర్వే సంస్థలు కూడా తమ సర్వే పై పెట్టుకున్న నమ్మకాన్ని రాజకీయ పెట్టుబడిగా పెట్టి రాజకీయ పార్టీలతో అంతర్గత ఒప్పందాలు చేసుకుని ఆయా పార్టీల నాయకుల సేవలో తరిస్తూ నమ్మినవారిని నట్టేట ముంచుతున్నాయి.
గతంలో ఆరా మస్తాన్ సర్వే సంస్థ కూడా ఇదే మాదిరి 2019 లో వైసీపీ గెలుపుని అంచనా వేసి ప్రజలలో గొప్ప నమ్మకాన్ని సంపాధించుకుంది.
తరువాత ఆ నమ్మకాన్ని తన పెట్టుబడిగా మలచి 2024 ఎన్నికలలో వైసీపీ తో అంతర్గత ఒప్పందాలు చేసుకుని 11 సీట్లతో ఘోర ఓటమిని పొందిన వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి రానుంది అంటూ YCP కి అనుకూలంగా సర్వే వివరాలను ప్రకటించింది.
దీనితో ఆరా మస్తాన్ కు ఉన్న గత ట్రాక్ రికార్డు దృష్ట్యా ఆయన సర్వేను నమ్ముకుని వైసీపీ మద్దతుదారులతో పాటుగా బెట్టింగ్ రాజాలు కూడా కూటమి ఓటమి పై వైసీపీ గెలుపు పై బెట్టింగులు జరిపి ఊహించని నష్టాన్ని మూటకట్టుకున్నారు.
ఇలా ఈ సర్వే సంస్థల బెట్టింగ్ ఆధారంగా జరిగే బెట్టింగులు ఆర్థికంగా కోట్లలో లావాదేవీలు జరుపుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే నాడు ఆరా మస్తా నేడు KK సర్వేలు ఒకరి మెప్పు కోసం ఒక పార్టీ కి ప్రయోజనం చేకూర్చడం కోసం తమ వృత్తిని రాజకీయంగా తాకట్టు పెడుతున్నారు అనే అంశాన్ని గ్రహించలేకపోతున్నారు.
అయితే సర్వే సంస్థలు తమ సర్వేలతో ఓటర్ల నాడిని పట్టాల్సిన పరిస్థితి నుంచి పార్టీ నాయకుల చేతులను పట్టుకొనే స్థాయికి పడిపోతున్నాయా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటి ఫలితమే ఇలా నాడు ఆరా మస్తాన్ సర్వే తన నిబద్ధతను కోల్పోగా ఇప్పుడు KK సర్వే తన నిజాయితీని రాజకీయ బలిపీఠం ఎక్కించిందా.?
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…