
“తన ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారక రామారావు పేరిట ఆసుపత్రి ప్రారంభోత్సవమని తెలిసిన కారణంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని, అంతేకాక ఈ ఆసుపత్రికి తన గురువు నందమూరి హరికృష్ణ నిధులిచ్చారని, అందుకే ఆయనతో కలిసి వచ్చానని.., ఎన్ని పార్టీలు మారినా, తనకు హరికృష్ణే గురువని చెప్పిన కొడాలి నాని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కలిసి నడుస్తానని, తన రాజకీయ జీవితమంతా జగన్ తోనే సాగుతుందని చెప్పి ఎలాంటి పుకార్లకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడారు.
దీంతో ‘బాల్’ హరికృష్ణ కోర్టులో పడ్డట్లయ్యింది. టిడిపిని వీడే ఉద్దేశంలో హరికృష్ణ ఉన్నారా? లేక తెలుగుదేశం పార్టీని మానసికంగా ఇరుకున పెట్టడానికి జగన్ – హరికృష్ణ వర్గాలు జరిపే కుట్రలో భాగమేనా ఇవన్నీ..? దీనికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉండగా… ఎక్కువ సమయం కాలానికి వదిలేస్తే… ముంచుకొచ్చే కాలం ముందు సేద తీరడం సాధ్యమయే విషయం కాదు.
Kamakshi Bhaskarla is an emerging actress in Tollywood who is trying to establish herself as…
Nandamuri Balakrishna is starring in an action film directed by Gopichand Malineni. The makers have…