
“బోడి లింగం ఎవరో శివ లింగం ఎవరో మొన్న ఎన్నికల్లో చూడలేదా? భీమవరం గాజువాక వెళ్తే ఎవరు బోడిలింగమో తెలుస్తది. గుడివాడ, మచిలీపట్టణం వెళ్తే ఎవరు శివలింగమో తెలుస్తది. ఈ రాష్ట్రానికి బోడి లింగం నువ్వే. అయినా సిగ్గు రాలేదు. జగన్ మోహన్ రెడ్డి గారు శివలింగం కాబట్టే నెత్తిన పెట్టుకున్నారు,” అని కొడాలి నాని అన్నారు.
“ప్యాకేజీ ఇస్తే వచ్చేస్తావ్. ఎవడో స్క్రిప్ట్ ఇస్తే సదివి వెళ్తావ్… నాలుగు పార్టీలు కలిపి పోటీ చేసినా నువ్వు బోడిలింగానివి కాబట్టే కింద పడేశారు. సిగ్గుశరం లేకుండా వస్తావ్.. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టం,” అని విరుచుకుపడ్డారు. ఏది ఏమైనా ఇప్పటివరకు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మాటల పోరులో జనసేన కూడా వచ్చి చేరింది.
పవన్ కళ్యాణ్ ఎత్తిచూపిన సమస్యలను వదిలేసి… రెండు చోట్ల ఓడిపోయావ్.. ప్యాకేజీ అనే దగ్గరే అధికార పార్టీ వారు ఆగిపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలే ఈ తరహాగా ఉన్నాయి… ప్రజాసమస్యల మీద చర్చ జరగడం అనేది ఎప్పుడు పోయింది. ఇందులో ఎవరిని నింధించినా ఏం ఉపయోగం?
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…