
తన తండ్రి చనిపోయిన తర్వాత సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, ఆయన అనుచరుల దాడులు, వేధింపులు భరిస్తూ టిడిపిని కాపాడుకొంటూ వస్తున్నామని, కానీ తమను కాదని పార్టీలు మారివచ్చిన కన్నా లక్ష్మినారాయణకు టికెట్ ఖరారు చేయడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని కోడెల శివరాం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు కన్నాకు టికెట్ ఖరారు చేసేముందే కోడెల శివరాంతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు సమాచారం. కనుక కోడెల శివరాం ఈరోజు తన అంచరులతో కలిసి సత్తెనపల్లిలో తండ్రి ఫోటోతో ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేశారు. తప్పనిసరిగా సత్తెనపల్లి టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సత్తెనపల్లి టిడిపిలో రాజుకొన్న ఈ నిప్పును వెంటనే చల్లార్చకపోతే మంత్రి అంబటి రాంబాబు దానిని రాజేసి పార్టీలో చిచ్చుపెట్టడం ఖాయం. విజయవాడలో కూడా కేశినాని సోదరుల పంచాయితీలో చంద్రబాబు నాయుడు నలిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పంచాయతీలు చంద్రబాబు నాయుడు కోర్టులోనే ఉన్నాయి కనుక ఆయన వారిరువురినీ ఏవిదంగా బుజ్జగిస్తారో… దానికి వారు చల్లబడతారో లేదో?
After Dragon, NTR is expected to join hands with Trivikram Srinivas for GOW. However, a…
Vidya Balan has revealed that missing the chance to play legendary Carnatic singer M.S. Subbulakshmi…