
తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 83 పరుగులకే పాకిస్తాన్ చాప చుట్టేయడంతో భారత్ విజయం ఖరారైంది. భారీ బ్యాటింగ్ లైనప్ కలిగి ఉండడంతో సునాయాసంగా 84 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తుందని క్రికెట్ ప్రేమికులు భావించారు. అయితే స్వల్ప లక్ష్య చేధనలో తొలి నాలుగు బంతుల్లో (రోహిత్ శర్మ, రేహనే) 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా, మూడవ ఓవర్ లో రైనా రూపంలో మూడో వికెట్ ను కోల్పోయి, మ్యాచ్ పై ఆసక్తిని పెంచారు. దీంతో ఒక్కసారిగా 84 పరుగుల లక్ష్యం భారత్ బ్యాట్స్ మెన్లకు భారీగా కనపడింది.
ఈ సమయంలో భారత బ్యాటింగ్ విభాగాన్ని నెత్తిన వేసుకున్న విరాట్ కోహ్లి ఆసక్తికరమైన మ్యాచ్ ను టీమిండియా వైపుకు తిప్పాడు. దీంతో మ్యాచ్ విజయంపై ప్రేక్షకుల్లో అనాసక్తి నెలకొంది. అంతటి బౌలింగ్ పిచ్ పై కూడా 51 బంతుల్లో 49 పరుగులు చేసి తన సత్తాను మరోసారి చాటిచెప్పాడు కోహ్లి. అయితే హాఫ్ సెంచరీ ముంగిట ఎంపైర్ చేసిన తప్పిదానికి ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు కోహ్లి. వెనువెంటనే మరో వికెట్ కోల్పోయినప్పటికీ ధోని ఫోర్ తో మ్యాచ్ భారత్ ఖాతాలో పడింది.
మొత్తమ్మీద 15.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 83 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు విజయవంతంగా చేధించగలిగింది. విరాట్ కోహ్లి బ్యాటింగ్ ప్రతిభకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. భారత జట్టు తన తదుపరి మ్యాచ్ ను డాఖ వేదికగా మార్చి 1వ తేదీన శ్రీలంక జట్టుతో ఆడనుంది.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…