
భారత క్రికెట్ చరిత్రలో కపిల్, సచిన్, ధోని తో సరిసమానంగా నిలచే దిగ్గజ ఆటగాడు కోహ్లీ. అయితే కపిల్ భారత జట్టుకి తొలి వరల్డ్ కప్ అందించిన ఆటగాడిగా తన పేరును చిరస్మరణీయం చేసుకుంటే,
సచిన్ కి ముందు సచిన్ తరువాత అనే స్థాయిలో భారత క్రికెట్ ను ప్రపంచం ముందుంచిన ఆటగాడిగా రమేష్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా గౌరవం దక్కించుకున్నారు.
ఇక మిస్టర్ కూల్ కెప్టెన్ గా ధోని ప్రపంచ స్థాయి గౌరవం పొందాడు, అలాగే తన కెప్టెన్సీ ప్రతిభతో భారత జట్టుని అన్ని ఫార్మాట్ లలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ లిస్ట్ లో తన ఎగ్రెసివ్ ఆటతో యావత్ క్రికెట్ అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు కోహ్లీ.
తన బ్యాట్ ని అడ్డుపెట్టి ఎన్నో సందర్భాలలో భారత జట్టుకి ఓటమి దరిచేరకుండా కాపాడాడు. అటువంటి కోహ్లీ సైతం కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయాడని, ఇక తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి కొత్తవారికి అవకాసం ఇవ్వాలంటూ అనేక ఒత్తిడిలను ఎదుర్కున్నాడు.
అయితే వాటిలో కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గిన కోహ్లీ మరికొన్ని ఒత్తిళ్లను సవాల్ చేస్తూ తన పై విమర్శలు ఎక్కుపెడుతున్న వారికి తన బ్యాట్ తో ఎదురొడ్డి పోరాడుతున్నాడు. అందులో భాగంగానే భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న వన్ డే సిరీస్ లో అడుగుపెట్టిన కోహ్లీ రాంచీలో ఆడిన తన మొదటి మ్యాచ్ లో 135 రన్స్ బాధి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక ఆ తరువాత రాయపూర్ లో జరిగిన సెకండ్ వన్ డే లో సైతం కోహ్లీ వరుసగా రెండో శతకం నమోదు చేసి తన బ్యాటింగ్ ఫామ్ పై వస్తున్న విమర్శలకు, టీంలో తన స్థానం పై చేస్తున్న కామెంట్స్ కు సరైన బదులు చెప్పారు. దీనితో కోహ్లీ తన బ్యాటింగ్ తో టీం ఇండియా కు తాను అవసరం అని తనను తానూ నిరూపించుకున్నారు.
మరి టీం హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌతం గంభీర్ తన పై క్రికెట్ అభిమానులలో పెరుగుతున్న వ్యతిరికతను, తనకు ఎదురవుతున్న విమర్శలకు ఎటువంటి జవాబు చెపుతారు.? టెస్ట్ సిరీస్ లలో భారత జట్టుకి ఎదురైనా వైట్ వాష్ వంటి ఘోర పరాభవాలు ఒకపక్క,
350 వంటి బారి స్కోర్ సాధించినప్పటికీ వన్ డే లలో టీం ఇండియా ఓటమి మరోపక్క గంభీర్ ని చుట్టుముట్టాయి. దానికి తోడు జట్టు సభ్యలకు – తనకు మధ్య కనిపిస్తున్న గ్యాప్, రో – కో ల స్థానం విషయంలో గంభీర్ వ్యవహారస్తున్న తీరు వీటన్నిటికీ గంభీర్ ఖచ్చితంగా జవాబు చెప్పాలి అంటూ పట్టుబడుతున్నారు క్రికెట్ అభిమానులు.
అలాగే రో – కో లు ఎలా అయితే తమ పై వచ్చిన విమర్శలకు తమ బ్యాట్ తో బదులు చెప్పి టీం ఇండియా కి తాము అవసరం అన్ని నిరూపించుకున్నారో, అలాగే గంభీర్ సైతం తన కోచింగ్ విధానాల పై సర్వత్రా వినిపిస్తున్న వ్యతిరేక స్వరాలను తన పనితీరుతో తిరిగి మెప్పించగలగాలి, అలాగే భారత జట్టుకి తన కోచింగ్ అవసరమని నిరూపించుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు రో – కో అభిమానులు.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…