
ఇదిలా ఉంటే, ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హాట్ హాట్ దర్శకుల జాబితాలో కొరటాల పేరు ప్రముఖంగా వినపడుతోంది. కొరటాలతో సినిమా చేయడానికి నిర్మాతలు, హీరోలు వెంట పడుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి కొరటాలతో సినిమాను ప్రారంభించి మరీ వదులుకున్న ఘనత మెగా వారసుడు రామ్ చరణ్ ది. అధికారికంగా ప్రకటించి, పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న సినిమా ఆగిపోయిన విషయం తెలిసిందే.
కారణాలు ఏమైనా గానీ, ప్రస్తుతం కొరటాల శివ ఉన్న స్థాయికి మళ్ళీ రామ్ చరణ్ తో సినిమా చేస్తాడా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే… వాస్తవానికి ‘జనతా గ్యారేజ్’ తర్వాత చెర్రీతోనే కొరటాల జత కడతాడు అన్న ఊహాగానాలు వచ్చిన నేపధ్యంలో… తన తదుపరి సినిమా మహేష్ బాబుతో అంటూ కొరటాల చెప్పేయడంతో చెర్రీ వెనుకబడ్డాడు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియా వర్గీయులు… ‘రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది?’ అని ప్రశ్నించగా…
‘రామ్ చరణ్ తో సినిమానా… ఎప్పుడో చెప్పలేను…’ అంటూ బదులిచ్చాడు కొరటాల. అలాగే ‘ప్రభాస్ తో కూడా ఎప్పుడో చెప్పలేను’ అంటూ పలికిన కొరటాల, అందరి స్టార్ హీరోలతో పని చేయాలని ఉంది, ఖచ్చితంగా చేస్తాను… అంటూ తెలిపారు. అయితే కొరటాలకు ఉన్న కమిట్మెంట్స్ రీత్యా ఇప్పట్లో చెర్రీకి అవకాశం దక్కడం అసాధ్యంగానే కనపడుతోందని సినీవర్గాలు పేర్కొంటున్నాయి.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…