
తెలుగు సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ లలో ‘శ్రీమంతుడు’ సినిమాది రెండవ స్థానం. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో ‘కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం’ తానే అందించినట్లుగా కొరటాల శివ పేరు ఉంటుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విషయంలో ఎలాంటి వివాదం లేదు గానీ, కధ విషయంలో తాజాగా చెలరేగిన వివాదం ఏకంగా కోర్టు మెట్లెక్కింది. ‘శ్రీమంతుడు’ సినిమా కధ నేను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవల అని, దీనిని కొరటాల కాపీ కొట్టారని శరత్ చంద్ర అనే రచయిత గుప్పించిన ఆరోపణలు ఇప్పటివి కావు.
అయితే ఈ విషయంలో 10 లక్షల సెటిల్మెంట్ కు కొరటాల సిద్ధమయ్యారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అయినప్పటికీ అవి విఫలం కావడంతో ప్రస్తుతం ఈ వివాదం ఇది సిటీ సివిల్ కోర్టు పరిధిలోకి చేరింది. తెలుగులో ఇప్పటికే విడుదలైన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారని, దీనిపై స్టే ఇవ్వాల్సిందిగా శరత్ చంద్ర కోరుతూ దర్శకుడు కొరటాలకు, నిర్మాతలకు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసారు. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఇందులో మహేష్ ఇరుక్కోకపోవడం ప్రిన్స్ కు, ఆయన అభిమానులకు ఊరటనిచ్చే అంశం.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…