
కొరటాలా చాలా కష్టపడి మహేష్ బాబును ఒప్పించగలిగాడు. కానీ ఇప్పుడు, చిరంజీవి మనసు మార్చుకున్నాడని సమాచారం. ఈ పాత్రకు రామ్ చరణ్ మాత్రమే కావాలి అని పట్టుబడుతున్నారట. ఈ చిత్రంలో ఆ గెస్ట్ రోల్ చాలా బాగా వచ్చిందని, తండ్రీ కొడుకులు ఆ పాత్రలలో కనిపిస్తే చాలా బావుంటుందని చిరంజీవి ఉద్దేశమట.
దీనితో రామ్ చరణ్ చేతే ఈ పాత్ర చెయ్యించాలని చిరంజీవి నిర్ణయించుకున్నారట. మహేష్ బాబును ఒప్పించటానికి కొరటాల చేసిన కృషి వృథా అయిందని, పైగా మహేష్ బాబు దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని కొరటాల కలత చెందారట. ఈ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది.
అయితే ఇప్పుడు, ఆచార్యను ఆర్‌ఆర్‌ఆర్ ముందు విడుదల చేయడానికి అనుమతించమని రాజమౌళిని ఒప్పించే బాధ్యత చిరంజీవి మరియు చరణ్‌పై ఉంది. ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే రామ్ చరణ్ మేలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతాడు.
Last week was a fairly entertaining one for the Telugu OTT audience as we had…
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…