Telugu

కొరటాలకు సినిమా కష్టాలు… బయటపడేదెలా?

తెలుగు సినిమాలన్నిటికీ కొన్ని బేసిక్ ఫార్ములా కధలుంటాయి. వాటినే రచయితలు, దర్శకులు మార్చిమార్చి తీస్తుంటారు. ఇవికాక రామాయణ, మహాభారత, భాగవతాలు, విదేశీ సినిమాల స్పూర్తితో కూడా సినిమాలు తీస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెడుతున్న నూతన రచయితలు, దర్శకులు చక్కటి కధలతో సినిమాలు తెరకెక్కించి అందరినీ ఆకట్టుకుంటుంటే, స్టార్ డైరెక్టర్స్‌గా మంచి పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌, కొరటాల శివ వంటివారు నిర్మాతల చేత వందల కోట్లు ఖర్చు పెట్టించి ఇంకా మూస కధలతోనే పల్టీలు కొడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆ మూస కధలను మళ్ళీ మళ్ళీ చక్కగా తీసి చూపించినా ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉంటారు. కానీ పత్రికలలో వచ్చిన కధలని కూడా దర్శకులు కాపీ కొట్టి సినిమా తీస్తారని తెలిస్తే ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోక తప్పదు.

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌తో దేవర సినిమా చేస్తున్న దర్శకుడు కొరటాల శివ అదే కేసులో చిక్కుకున్నారు. ఆయన 2015లో మహేష్‌ బాబుతో చేసిన ‘శ్రీమంతుడు’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ అదే ఇప్పుడు ఆయన పీకకు ఉచ్చులా బిగుసుకోవడం విశేషం.

గతంలో స్వాతి పత్రికలో తాను వ్రాసిన ఆ కధని దర్శకుడు కొరటాల శివ కాపీ కొట్టి దాంతో ‘శ్రీమంతుడు’ సినిమా తీశారని, అప్పుడే ఆ కధా రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో కేసు వేశారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు కొరటాల శివ హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.

ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే నాంపల్లి, హైకోర్టుల తీర్పులను సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. రచయితల సంఘం నిశిత పరిశీలన తర్వాతే దిగువ కోర్టులు ఆ తీర్పు చెప్పాయని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తూ, కొరటాల శివ పిటిషన్‌ విచారణకు అర్హం కాదని తేల్చి చెప్పింది. దాంతో ఆయన పిటిషన్‌ వెనక్కు తీసుకోవలసి వచ్చింది.

అంటే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే నాంపల్లి కోర్టు తీర్పు అమలులోకి వస్తుందన్న మాట! కనుక కొరటాల శివ ముందు రెండే మార్గాలున్నాయి. 1. సదరు రచయితతో కోర్టు బయట రాజీ పడటం, 2. నేరం అంగీకరించి శిక్షని ఎదుర్కోవడం!

ఆయన ఈ కేసు నుంచి ఏ విదంగా బయటపడినప్పటికీ, ఓ వారపత్రికలో కధని కాపీ కొట్టి సినిమా తీశారనే అపఖ్యాతి ఎప్పటికీ మిగిలిపోతుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో జూ.ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ బ్యూటీ జాహ్నవీ కపూర్‌లతో దేవర సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నప్పుడు, ఈ కేసు ఈవిదంగా ముగింపుకి చేరుకోవడం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఈ కేసు ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓ హెచ్చరికవంటిదే అని చెప్పవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Laxman Gave Vaibhav Chances, GG Hasn’t: Is It Fair?

Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…

7 minutes ago

Sundeep Kishan Has a Rare Promise for Moviegoers

Sundeep Kishan usually keeps things low-key while promoting his films and rarely makes big claims…

37 minutes ago