
Varun Tej's Korean Kanakaraju blends horror and comedy, with Sathya's performance emerging as the film's biggest highlight.
చిత్రం: కొరియన్ కనకరాజు
M9 రేటింగ్: 2.25/5
విడుదల తేదీ: ఆగస్ట్ 07, 2026
తారాగణం: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, అవసరాల శ్రీనివాస్ తదితరులు
నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ – యువి క్రియేషన్స్
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
సంగీతం: తమన్
నిర్మాత: రాజీవ్ రెడ్డి – సాయిబాబు జాగర్లమూడి
ఛాయాగ్రహణం: మనోజ్ రెడ్డి
కూర్పు: సత్య.జి
“గద్దలకొండ గణేష్” అనంతరం సరైన హిట్ లేక చతికిలపడిన వరుణ్ తేజ్ ఎక్స్ పెరిమెంట్స్ ని పక్కన పెట్టి.. మోస్ట్ సక్సెస్ ఫుల్ హారర్ కామెడీ జానర్ లో నటించిన సినిమా “కొరియన్ కనకరాజు”. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్య కీలకపాత్రలో నటించాడు. కాస్త లో ప్రీబజ్ తోనే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంది? వరుణ్ కి హీరోగా కావాల్సిన కమ్ బ్యాక్ ఇవ్వగలిగిందా? అనేది చూద్దాం..!!
కథ:
పెనుగొండలో పెద్దగా పనేం లేకుండా, ఒక డాన్సింగ్ ట్రూప్ నడుపుతూ టైంపాస్ చేసే కనకరాజు (వరుణ్ తేజ్) శరీరంలోకి ఊహించని విధంగా కొరియా నుండి పెనుగొండ వయా అనంతపూర్ కియా ఫ్యాక్టరీ వచ్చిన ఓ కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది.
ఆ ఆత్మ ఎవరు? కనకరాజు శరీరంలోకి ఎలా దూరింది? ఆ కారణంగా కనకరాజు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమిటి? అనేది “కొరియన్ కనకరాజు” కథాంశం.
నటీనటుల పనితీరు:
వరుణ్ తేజ్ కామెడీ ఆల్రెడీ “ఎఫ్2, ఎఫ్3” సినిమాల్లో చూసినప్పటికీ.. కనకరాజుగాను సీమ యాసలో మెప్పించేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా కొరియా డాన్ గా, పెనుగొండ కుర్రాడిగా చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి.
సత్య ఈ సినిమాకి సెకండ్ హీరో మాత్రమే కాదు.. సినిమాని బ్రతికించిన హీరో అని చెప్పొచ్చు. ఫస్టాఫ్ లో వచ్చే కుక్క ఎపిసోడ్, సెకండాఫ్ లో వచ్చే వీడియో కాల్ పూజ ఎపిసోడ్ లో సత్య తన కామెడీ టైటింగ్ తో కడుపుబ్బా నవ్వించాడు. మిగతా సన్నివేశాల్లోనూ సత్య సీన్ లో తన పాత్ర ఏమిటి అనేది పట్టించుకోకుండా రెచ్చిపోయాడు.
రితికా నాయక్ స్వీట్ & సింపుల్ గా తన పాత్రకు న్యాయం చేసింది. అవసరాల శ్రీనివాస్, చిన్న వంటి నటులు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు:
తమన్ పాటలు పెద్దగా అలరించకపోగా.. సౌండ్ మిక్సింగ్ మైనస్ అవ్వడం అనేది సినిమాని డ్యామేజ్ చేసింది. ఫస్టాఫ్ లో మొదటి 20 నిమిషాలు మాటలు, పాట కూడా స్పష్టంగా వినిపించలేదు. మనోజ్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఆత్మల ఫైట్ అనేది మరీ కార్టూన్ లా ఉండడం పెద్ద మైనస్.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ పేలవంగా ఉన్నాయి. బార్ & చర్చ్ లొకేషన్స్ సెట్స్ అని చాలా స్పష్టంగా కనిపిస్తుంటాయి. కాస్తంత సహజత్వం ఉండుంటే బాగుండేది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఒక రొటీన్ టెంప్లేట్ కథని కాస్తంత వైవిధ్యంగా చూపిద్దామని ప్రయత్నించాడు. అయితే.. ట్విస్ట్ పాయింట్ కొత్తగా ఉన్నా.. కథను, కథనాన్ని డీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ముఖ్యంగా మొదటి 20 నిమిషాలు టెంప్లేట్ ని ఫాలో అయిన విధానం ఇరిటేట్ చేయడం ఖాయం. ఇప్పుడు కూడా ఇంకా హీరోకి ఇంట్రడక్షన్ సాంగ్ & ఫైట్ ఉండాలి అనుకోవడం హాస్యాస్పదం. ఆ టెంప్లేట్ మేకింగ్ & ప్రెడిక్టబిలిటీ విషయంలో మేర్లపాక గాంధీ చేతులెత్తేశాడు కానీ.. తన మార్క్ కామెడీ సీన్స్ తో మాత్రం సినిమాని కాపాడుకున్నాడు. సత్య లాంటి కమెడియన్ దొరికినందుకు, అతడ్ని పూర్తిస్థాయిలో వాడుకున్నాడు. దాంతో గాడితప్పుతుంది అనుకున్న సినిమా.. ప్రేక్షకుల్ని నవ్వించగలిగింది. గాంధీ ఇంకాస్త వైవిధ్యంగా కథనాన్ని, సన్నివేశాల్ని రాసుకుని ఉండుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే.. మునుపటి సినిమాలతో పోల్చితే చాలా బెటర్ గా ఎంటర్టైన్ చేసాడు కాబట్టి బొటాబోటి మార్కులతో పర్వాలేదనిపించుకున్నాడు.
విశ్లేషణ:
హారర్ కామెడీ అనేది మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్. దాన్ని ఎంత బాగా తీస్తే అంత పెద్ద హిట్. హిట్లు లేక అల్లల్లాడుతున్న అక్షయ్ కుమార్ కి సైతం సక్సెస్ ఇచ్చి ట్రాక్ మీదకి తీసుకొచ్చిన జానర్ ఇది. దాన్ని ఎంత కొత్తగా, ఎంగేజింగ్ గా డిజైన్ చేస్తున్నావు అనేదాన్ని బట్టి సక్సెస్ రేంజ్ ఉంటుంది. “కొరియన్ కనకరాజు” సినిమాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ.. ఆ ఎలిమెంట్స్ ని టెంప్లేట్ ఫార్ములాలో వాడుకోవడం వల్ల మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ మినహా మిగతా సినిమా అలరించలేకపోయింది. సత్య కాపాడిన కొరియన్ కనకరాజుతో వరుణ్ కి కావాల్సిన హిట్ వచ్చినప్పటికీ.. ఇది అతడికి పూర్తిస్థాయి కమ్ బ్యాక్ సినిమా అయితే కాదు.
ఓవరాల్ గా.. కొరియన్ హారర్ ని డామినేట్ చేసిన సత్య కామెడీ!
M9 రేటింగ్: 2.25/5
In Tollywood, announcing a release date is one thing, sticking to it is another. Naga…
The proposed 189.93-km Amaravati Outer Ring Road (ORR) will have 17 interchanges along its six-lane,…