Telugu

ఏమని వర్ణించాలి ఈ పెట్టని “కోట” గురించి..!

అది 1947వ సంవత్సరం… జూలై 10వ తేదీ… మరికొద్ది రోజుల్లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాబోతోందని అప్పటివరకు ఎవరికీ తెలియదు… అలాగే ఆ రోజున ఈ ధరిత్రిపై పడిన ఒక చిరు బాలుడు త్వరలో ఒక సినీ సామ్రాజ్యాన్ని ఏలతాడు అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు..! అవును… ఒక్క తెలుగు వారే కాదు, భారతదేశం ప్రజలందరూ గర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ‘కళాకారుడు’ కోట శ్రీనివాసరావు జన్మదినోత్సవం జూలై 10 అని బహుశా అందరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ప్రముఖ హీరోల, హీరోయిన్ల పుట్టినరోజులను మాత్రమే గుర్తు పెట్టుకునే సినీ జనాలకు కోట వంటి వారి పుట్టినరోజును గుర్తు పెట్టుకునే అవకాశం చాలా తక్కువ.

‘ప్రాణం ఖరీదు’ సినిమా అంటే… టక్కున ‘మెగాస్టార్ చిరంజీవి’ నటించిన మొదటి సినిమా అని చెప్పే వారికి, అదే సినిమా ద్వారా కోట శ్రీనివాసరావు కూడా తెరంగ్రేటం చేసారన్న విషయం ఎంత మందికి తెలిసి ఉంటుంది? అక్కడ నుండి మొదలైన “కోట” ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు… మరెన్నో ఆనమాళ్ళను ఆవిష్కరించారు. ఎంతగా అంటే… సినీ కళామ్మ తల్లి నిజంగా అంటూ ఉంటే ఆమే పులకించిపోయేటంతగా..! అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. తెలుగు సినీ వినీలాకాశంలో ఎలాంటి పాత్రకైనా నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటులలో అగ్ర తాంబూలం ఎస్వీ రంగారావు దక్కించుకుంటే, మరుసటి స్థానం మన కోట వశం కావాల్సిందేనని ముక్తకంఠంతో చెప్పవచ్చు.

ADVERTISEMENT

‘అవును… నేనే ఆ మలపత్రాష్టుడ్ని…’ అంటూ ఎంట్రీ ఇచ్చినా… ‘వాడికి నేను అంతే గడువిస్తున్నానురా బాబూ…’ అంటూ కామెడీ విలనిజం చూపించినా… ‘నేన్ బతకాలి తంభి…’ అని పొలిటికల్ విలన్ గా హావభావాలు పలికించినా… ‘సినిమా కధలు చెప్తూ కడుపుబ్బా…’ నవ్వించినా… ‘కోడలినే చెరిచే మామ గారి అవతారం’ ఎత్తినా… ‘కనీసం స్పెల్లింగ్స్ రాని కానిస్టేబుల్ గా’ మారినా… ‘హలో మాస్టారు…’ అంటూ బాబూమోహన్ ను కాలితో తన్నినా… ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ “కోట” కళా జీవితం వర్ణించడం ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ కైనా సాధ్యమో కాదో..!

ఇలాంటి కళాకారుడు మన తెలుగు వాడైనందుకు సగర్వంగా చెప్పుకుంటూ… ఈ “కోట” శుభసౌభాగ్యాలతో సకల సంతోషాలతో నిండు నూరేళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తూ… వీలుంటే మరికొన్ని పాత్రల ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులను తన ముగ్ధమనోహరమైన హావభావాలతో రంజింపచేయాలని కోరుకుందాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కేసీఆర్, జగన్…క్లైమాక్స్ లోనే ఎంట్రీ ఇస్తారా.?

పాత కాలం సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే రెండున్నర గంటల కథలో సినిమా కు శుభం కార్డు పడే…

10 minutes ago

Ravi Teja After Irumudi: Is Vivek Athreya His Best Chance?

Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…

25 minutes ago