
నేను వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి దీనిపై మళ్ళీ సర్వే నిర్వహించమని అడిగాను. నన్ను కలిసినా కలవకపోయినా నా నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛను అందాలని, ఏ ఒక్కరికీ తొలగించకూడదని నేను గట్టిగా కోరుకొంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఈ పింఛన్లే ఆధారం. వారికి వేరే ఆదాయం లేదు. కనుక మీడియాలో ఈ పింఛన్ల తొలగింపు కార్యక్రమం గురించి వస్తున్న వార్తలు నిజం కాకూడదని నేను కోరుకొంటున్నాను,” అని అన్నారు.
సంక్షేమ పధకాల భారంతో క్రుంగిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం బహుశః ఆ ఆర్ధిక భారం తగ్గించుకొనేందుకు హటాత్తుగా సుమారు 1.60 లక్షల మంది పాత పింఛనుదారులకు నిబందనల పేరుతో పింఛన్ నిలిపివేసేందుకు నోటీసులు పంపిస్తోంది. ఇప్పటికే గడప గడపకి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంటుండటంతో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఈ పింఛన్లు నిలిపివేస్తే ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితి ఏర్పడుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వైసీపీ నేతలు భయపడుతున్నారు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…