‘కృష్ణగాడి’ కలెక్షన్స్ వెనుక ఉన్న ‘మర్మం’

నాని హీరోగా విడుదలైన “కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి లభించిన టాక్, కలెక్షన్లపై ప్రభావితం చూపలేకపోయాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. “భలే భలే మగాడివోయ్” వంటి బ్లాక్ బస్టర్ నానికి బ్యాక్ గ్రౌండ్ లో ఉండి కూడా, ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోవడం వెనుక కారణాలను చిత్రయూనిట్ అన్వేషిస్తోంది.

అయితే, సినిమాలో బాలకృష్ణ అభిమానిగా నాని కనపడడంతో కేవలం ఒక వర్గానికే సినిమా పరిమితమైందేమో అన్న ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో మహేష్ పేరుతోనే సినిమా ఆద్యంతం నడిచిన “అష్టాచెమ్మా” సినిమా బ్లాక్ బస్టర్ గా మారిన వైనం తెలిసిందే. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, దానికి పట్టాభిషేకం చేయడం తెలుగు సినీ ప్రేక్షకుల వంతు. మరి తాజా సినిమాలో ఎందుకు ఫెయిల్ అయ్యిందో మరి!

ADVERTISEMENT

ఇదిలా ఉంటే ట్రేడ్ వర్గీయులు మాత్రం, ఫిబ్రవరి మాసం సినిమాలకు సీజన్ కాదు. ఏవో ఒకటి, అర సినిమాలు తప్ప ఈ నెలలో విడుదలై భారీ హిట్లు కొట్టిన ఘనత లేదని గుర్తు చేస్తున్నారు. విద్యార్ధుల పరీక్షల సమయం ముందు కావడంతో సాధారణంగా ఈ నెలలో పెద్ద సినిమాలు కూడా అందుకే విడుదల కావని, గత కొన్ని సంవత్సరాలను గమనిస్తే, ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. అయితే ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తోనూ, విజయయాత్రలతోనూ ఉత్సాహాపరిచే ప్రయత్నం చేస్తోంది.

విచిత్రమేమిటంటే… స్థానిక మార్కెట్ లో ఆశించిన స్థాయిలో లేకపోయిన “కృష్ణగాడి వీరప్రేమగాధ”కు యుఎస్ ప్రేక్షకులు మాత్రం పట్టం కట్టారు. యుఎస్ లో బ్లాక్ బస్టర్ కు బెంచ్ మార్క్ అయినటువంటి 1 మిలియన్ డాలర్స్ లక్ష్యంలో సగం పూర్తి చేసాడు నాని. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ధృవీకరిస్తూ తాజాగా పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఈ వీకెండ్ కూడా దుమ్ము దులిపితే 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరడం కృష్ణ గాడికి పెద్ద కష్టమేమి కాదన్నది ట్రేడ్ వర్గాల అంచనా.

Share
Published by

Recent Posts

Penalty on NRE Account Transfer Reversed: Big NRI Win

A decades-old Foreign Exchange case has ended with a significant ruling for NRIs and banking…

7 minutes ago

బీజేపీ పై యుద్ధం: రాజకీయ సమాధేనా.?

బీజేపీ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో పాతాళానికి పడిపోతున్నాయి. అయితే అది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా…

22 minutes ago