ట్రైలర్ టాక్ – మహేష్ ఎక్సైట్ అవ్వడానికి కారణం?

krishna-sri-sri-movie-trailer-talkచాలా కాలం తర్వాత నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ “శ్రీ శ్రీ” చిత్రంతో వెండితెరపై ఒక ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించబోతున్నారు. ఎన్నాళ్ళుగానో కృష్ణ సినిమా కోసం వేచిచూస్తున్న అభిమానులందరికీ సంతోషకరమైన విషయం. అలాంటి అభిమానగణంలో తానే అతి పెద్ద ఫ్యాన్ అని చెప్పిన ప్రిన్స్ మహేష్ బాబు “శ్రీ శ్రీ” ఆడియోను, ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.

వాస్తవంగా మాట్లాడుకుంటే… ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు లేవు. కానీ విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. కృష్ణ చెప్పిన ఒకే ఒక డైలాగ్ ఈ ట్రైలర్ లో వినపడుతుంది. ప్రస్తుత సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయమే తన కుటుంబంలో ఉన్న మహిళకు జరిగితే ఎలా రియాక్ట్ అయ్యాడనే విధంగా ఈ సినిమా కధ రూపొందినట్లు తెలుస్తోంది. ట్రైలర్ కూడా అలాంటి సంకేతాలనే ఇచ్చింది. 50 సంవత్సరాల సినీ ప్రస్థానం తర్వాత కూడా సూపర్ స్టార్ అంతే అందంగా వెండితెర కనిపిస్తుండడం బహుశా మహేష్ వంటి అభిమాన గణానికి ఆనందదాయకమైన అంశం.

ADVERTISEMENT

బహుశా మహేష్ కూడా అందుకే ఈ ట్రైలర్ పట్ల ఎక్సైట్ అయ్యారేమో! తను చెప్పిన రెండు, మూడు ముక్కలలో ట్రైలర్ కూడా ఆకట్టుకుందని ప్రిన్స్ ప్రస్తావించడం విశేషం. ఈ సినిమాకు అసలు అదనపు ఆకర్షణ ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనుండడం. దీంతో ఈ అంశం “శ్రీ శ్రీ” ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories