
ప్రతిపక్షాలు అడిగితే పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం, పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఏపీలో రోడ్ల దుస్తితి గురించి చిన్న కామెంట్ చేయగానే, హడావుడిగా నిధులు మంజూరు చేసి పనులకి ముహూర్తం కూడా ఖరారు చేయడం విశేషం.
సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 9,000 కిమీ రోడ్లు పూర్తిగా పాడైపోయాయని, వాటికి తక్షణం మరమత్తులు చేయాల్సి ఉందని అధికారులు చెప్పడంతో సిఎం జగన్మోహన్ రెడ్డి వాటి కోసం రూ.1,073 కోట్లు తక్షణం మంజూరు చేశారు.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పధకం కింద ఇదివరకు రోడ్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.83 కోట్లు బాకీ ఉందని అధికారులు చెప్పడంతో దానిని కూడా ఈ రూ.1,073 కోట్ల నుంచే తీసి చెల్లించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి ఈ నెల 15 నుంచి 20లోపుగా రోడ్డు మరమత్తు పనులు ప్రారంభించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఏపీ రోడ్ల పరిస్థితి గురించి కామెంట్ చేసినప్పుడు మన మంత్రులు వాటిని బలంగా తిప్పి కొట్టారు. కానీ రాష్ట్రంలో 9,000 కిమీ మేర రోడ్లు పూర్తిగా పాడైపోయాయని, వాటికి తక్షణం మరమత్తులు చేయాల్సి ఉందని ఇప్పుడు అధికారులే చెప్పారు. వాటి కోసం నిధులు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేపట్టాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ నిజమని అంగీకరించినట్లయింది కదా?
పొరుగు రాష్ట్ర మంత్రి చేత ఇలా ఎద్దేవా చేయించుకొనే బదులు రాష్ట్రంలో ప్రతిపక్షాలు గుర్తుచేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమత్తులు చేయించి ఉంటే ఈ అవమానం తప్పేది కదా?ఇప్పుడు కూడా వర్షాకాలం ముందు రోడ్లు మరమత్తులు చేస్తున్నందున నాసి రకం పనులు చేస్తే వర్షాలకు అవీ కొట్టుకుపోవచ్చు. అప్పుడు కేటీఆర్ స్నేహితుడు మళ్ళీ సంక్రాంతి పండుగకు వచ్చి గుంతలు పడిన ఆ రోడ్లు చూసి ‘నాడు-నేడు’ ఒకేలా ఉందని చెప్పవచ్చు. కనుక కనీసం సంక్రాంతి వరకు నిలిచేలా కాస్త గట్టిగా రోడ్లు వేస్తే మంచిది.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar was finally released in theatres…
After the average success of Sitaare Zameen Par, actor Aamir Khan has still not officially…